దెయ్యాలు అంటే ఆడవాళ్లేనా! | Women's demons says Comedian Vivek | Sakshi
Sakshi News home page

దెయ్యాలు అంటే ఆడవాళ్లేనా!

May 12 2015 4:03 AM | Updated on Jul 12 2019 4:40 PM

దెయ్యాలు అంటే ఆడవాళ్లేనా! - Sakshi

దెయ్యాలు అంటే ఆడవాళ్లేనా!

దెయ్యాలు అంటే ఆడవాళ్లేనా అని ప్రముఖ హాస్యనటుడు వివేక్ ప్రశ్నిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు విజయ్ సోదరుడు ఉదయ

 తమిళ సినిమా : దెయ్యాలు అంటే ఆడవాళ్లేనా అని ప్రముఖ హాస్యనటుడు వివేక్ ప్రశ్నిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు విజయ్ సోదరుడు ఉదయ హీరోగా నటిస్తున్న చిత్రం ఆవి కుమార్. నటి కనిక తివారి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని యాక్షన్ టేక్ మూవీ పతాకంపై ఎస్.శ్రీధర్, శివ, శరవణన్ నిర్మిస్తున్నారు. కే.కందీపన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి విజయ్ ఆంటోని సంగీతం అందించారు. ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల నగరంలోని ఓ నక్షత్ర హోటల్‌లో జరిగింది.
 
 ముఖ్య అతిథిగా పాల్గొన్న హాస్యనటుడు వివేక్ మాట్లాడుతూ ప్రస్తుతం పిశాచి, దెయ్యం లాంటి కథా చిత్రాలు అధికంగా వస్తున్నాయన్నారు. ఇలాంటి చిత్రాల్లో ఎక్కువగా ఆడవాళ్లనే దెయ్యాలుగా చూపిస్తున్నారని, మగవాళ్లను ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. మగ దెయ్యాలు ఉండవా అని అనుమానం వ్యక్తం చేశా రు. ఇకనైనా మగవాళ్లను కూడా దెయ్యాలుగా చూపించే చిత్రాలు తెరమీదకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలైపులి జీ.శేఖరన్, శివశక్తి పాండియన్, శ్రీకాంత్‌దేవా, ఉదయ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement