పోలీసు కార్యాలయం వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం | Woman commits suicide at Delhi Police Office | Sakshi
Sakshi News home page

పోలీసు కార్యాలయం వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం

Jul 14 2014 10:35 PM | Updated on Sep 2 2017 10:17 AM

పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద 45 ఏళ్ల మహిళ సోమవారం ఆత్మహత్యా యత్నం చేసింది. బాధితురాలి తన శరీరంపై సత్వరమే దగ్ధమయ్యే ఇంధనం పోసుకుని నిప్పంటించుకుంది.

 న్యూఢిల్లీ: పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద 45 ఏళ్ల మహిళ సోమవారం ఆత్మహత్యా యత్నం చేసింది. బాధితురాలి తన శరీరంపై సత్వరమే దగ్ధమయ్యే ఇంధనం పోసుకుని నిప్పంటించుకుంది. దీంతో ఆమె శరీరం 50 శాతం మేర కాలిపోయింది. దీంతో క్షతగాత్రురాలిని సమీపంలోని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సాయంత్రం 4.15 నిమిషాల సమయంలో దక్షిణ ఢిల్లీలో చోటుచేసుకుంది. ఫిర్యాదు ఇచ్చేందుకు తన కుమార్తెతో సహా ఇక్కడికి వచ్చిందని, అంతలోనే ఈ అఘాయిత్యానికి పాల్పడిందని పోలీసులు చెప్పారు. క్షతగాత్రురాలు కోలుకున్న తర్వాత వాంగ్మూలం నమోదు చేస్తామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement