మూడేళ్ల బాలుడిపై పోలీసుల ప్రతాపం | Sakshi
Sakshi News home page

మూడేళ్ల బాలుడిపై పోలీసుల ప్రతాపం

Published Tue, Jul 26 2016 4:52 PM

మూడేళ్ల బాలుడిపై పోలీసుల ప్రతాపం

చెన్నై: అభంశుభం తెలియని మూడేళ్ల బాలుడిపై తమిళనాడులోని మధురై పోలీసులు ప్రతాపం చూపించారు. దొంగతనంలో కేసులో ఆ బాలుణ్ని చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేసి 35 రోజులు జైలులో పెట్టారు. బాలుడి తల్లి కోర్టును ఆశ్రయించడంతో ఎట్టకేలకు విముక్తి లభించింది.

మధురై పోలీసులు నెల రోజుల క్రితం మురుగన్ అనే బాలుడితో పాటు అతని తండ్రి, అత్తమామలను దొంగతనం కేసులో అరెస్ట్ చేశారు. వాళ్లు గాజులు, బొమ్మలు అమ్ముతుండగా అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం కేసులో మురుగన్ పాత్ర ఉందని చెబుతూ పోలీసులు జైలులో పెట్టారని అతని తల్లి మేరీ చెప్పింది. మేరి మధురై కోర్టును ఆశ్రయించగా, న్యాయమూర్తి ఆదేశాల మేరకు పోలీసులు మురుగన్ను కోర్టులో ప్రవేశపెట్టారు. మురుగన్ను విడుదల చేసి అతని తల్లికి అప్పగించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. కాగా మిగిలిన ముగ్గురు నిందితులు జైలులో ఉన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement