మారాను.. నమ్మండి ప్లీజ్‌: దొంగ | Thief Petition For Robbery Cases in Tamil nadu | Sakshi
Sakshi News home page

మారాను.. నమ్మండి ప్లీజ్‌

Dec 18 2019 8:20 AM | Updated on Dec 18 2019 8:28 AM

Thief Petition For Robbery Cases in Tamil nadu - Sakshi

వినతి ఇవ్వడానికి భార్యతో వచ్చిన కమలకన్నన్‌

సాక్షి, చెన్నై : ఇ​కపై దొంగతనాలు చేయనంటున్నాడు ఓ దొంగ. 40 ఏళ్లకు పైగా చోరీల కేసుల్లో పట్టుబడిన యువకుడు తన భార్య కోసం మనసు మార్చుకుని జీవించనున్నానని, ఇందుకు అవకాశం కల్పించాలంటూ పోలీసులను వేడుకున్నాడు. చెన్నై కొరుక్కుపేటకు చెందిన కమలకన్నన్‌ (30)పై అనేక చోరీ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సోమవారం తన భార్య కళతో చెన్నై పోలీసు కమిషనర్‌ కార్యాలయం చేరుకున్నాడు. ఇకపై తాను చోరీలకు పాల్పడనని, సత్ప్రవర్తనతో జీవిస్తానని కమిషనర్‌ కార్యాలయంలో ఒక హామీపత్రం అందజేశాడు. దొంగతనాలు వదిలిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని పేర్కొన్నాడు. తనను మారిన మనిషిగా చూడాలని పోలీసులను అభ్యర్థించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement