తమిళ ఎమ్మెల్యేల జీతాలు రెట్టింపు | Tamil Nadu doubles MLAs' salaries to over Rs 1 lakh per month | Sakshi
Sakshi News home page

తమిళ ఎమ్మెల్యేల జీతాలు రెట్టింపు

Jul 20 2017 2:04 AM | Updated on Sep 5 2017 4:24 PM

రాష్ట్ర ఎమ్మెల్యేల జీతాలు, అలవెన్సుల మొత్తాన్ని తమిళనాడు ప్రభుత్వం దాదాపు రెట్టింపు చేసింది. ప్రస్తుతం వారికి నెలకు అందిస్తున్న రూ. 55 వేలను 90.91 శాతం పెంచి రూ.1,05,000కు చేర్చింది.

చెన్నై: రాష్ట్ర ఎమ్మెల్యేల జీతాలు, అలవెన్సుల మొత్తాన్ని తమిళనాడు ప్రభుత్వం దాదాపు రెట్టింపు చేసింది. ప్రస్తుతం వారికి నెలకు అందిస్తున్న రూ. 55 వేలను 90.91 శాతం పెంచి రూ.1,05,000కు చేర్చింది. సీఎం పళణిస్వామి అసెంబ్లీలో ఈమేరకు ప్రకటించారు. ఎమ్మెల్యే ఎస్‌. పాండి, మాజీ ఎమ్మెల్యేల వినతితో జీతాలను సీఎం భారీగా పెంచారు. ఎమ్మెల్యేలందరి ముఖాల్లో సంతోషం కనిపిస్తోందని స్పీకర్‌ ధనపాల్‌ అన్నారు. సీఎం, మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, విపక్ష నేత, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ల అలవెన్సులు కూడా పెరిగాయి. పెంపు ఈ నెల 1 నుంచి అమల్లోకి వస్తుంది. అప్పులు కట్టలేక, పంటలకు గిట్టుబాటు ధరల్లేక అల్లాడిపోతున్న రాష్ట్ర రైతులు తమ డిమాండ్ల సాధన కోసం దేశ రాజధాని ఢిల్లీలో నెలల తరబడి ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల జీతాలను భారీగా పెంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement