బేస్తవారిపేట మండలకేంద్రం సమీపంలో లారీ, ఆటో ఢీకొన్నాయి.
ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో నంద్యాల- ఒంగోలు రహదారిపై సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోగా ఏడుగురు గాయపడ్డారు. ప్రయాణికులతో వస్తున్న ఆటోను బెస్తవారిపేట జంక్షన్‌లో వేగంగా వెనుక నుంచి వచ్చిన ఉల్లిగడ్డల లోడు లారీ ఢీకొట్టింది. దీంతో ఆటో నుజ్జునుజ్జయింది. అందులో ఉన్న డ్రైవర్ సహా 8మంది గాయపడ్డారు. వారిని వెంటనే 108లో ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన పెంచికలపాడుకు చెందిన నర్రా కాశిరెడ్డి(59) ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయాడు. క్షతగాత్రుల్లో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.