ఏటీఎమ్‌లో రూ. 30 లక్షలు దోచుకున్నారు | Seven held for stealing Rs 29.7 lakh from ATM | Sakshi
Sakshi News home page

ఏటీఎమ్‌లో రూ. 30 లక్షలు దోచుకున్నారు

Mar 13 2017 7:21 PM | Updated on Sep 5 2017 5:59 AM

ఏటీఎమ్‌లో రూ. 30 లక్షలు దోచుకున్నారు

ఏటీఎమ్‌లో రూ. 30 లక్షలు దోచుకున్నారు

ఏటీఎమ్‌ నుంచి 29.70 లక్షల రూపాయలు దొంగలించిన ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

థానె: మహారాష్ట్రలోని థానె జిల్లా భివండిలో జాతీయ బ్యాంకుకు చెందిన ఏటీఎమ్‌ నుంచి 29.70 లక్షల రూపాయలు దొంగలించిన ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏటీఎమ్‌లలో నగదు నింపే ఓ ప్రైవేట్ కంపెనీలో వీళ్లు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.

మార్చి 11వ తేది అర్ధరాత్రి దొంగతనం జరిగినట్టు పోలీసులు తెలిపారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారించారు. ఏటీఎమ్ క్యాష్‌ బాక్స్ పాస్‌వర్డ్‌ తెలిసిన వారే దొంగతనానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానించారు. దీంతో ఏటీఎమ్‌లో నగదు నింపిన ఉద్యోగులను విచారించడంతో అసలు విషయం బయటపడింది. నిందితులు మార్చి 11న ఏటీఎమ్‌లో 36 లక్షల రూపాయల నగదును నింపారు. అదే రోజు అర్ధరాత్రి వచ్చి అందులోంచి నగదును కాజేశారు. నిందితులను వికాస్ ఎడె, సురేష్ కొకిట్కర్, వినోద్ వరాడె, నీలేష్ గోటిపముల్, మోహన్ జంజె, రాజేష్ పుల్‌పగారె, ఇర్ఫాన్ ఖయూం ఖాన్‌లుగా గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement