మణిరత్నం చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ | Saiyami Kher in Mani Ratnam's next | Sakshi
Sakshi News home page

మణిరత్నం చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ

Oct 14 2015 2:57 AM | Updated on Apr 3 2019 6:23 PM

మణిరత్నం చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ - Sakshi

మణిరత్నం చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ

మణిరత్నం చిత్రం ద్వారా మరో బాలీవుడ్ బ్యూటీ కోలీవుడ్‌లో పాగా వేయనుంది. ఒకప్పుడు ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం

మణిరత్నం చిత్రం ద్వారా మరో బాలీవుడ్ బ్యూటీ కోలీవుడ్‌లో పాగా వేయనుంది. ఒకప్పుడు ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం చిత్రంలో చిన్న వేషం అయినా వేసే అవకాశం కోసం నటీమణులు జపం చేసేవారు. అలాంటిది ఇప్పుడా పరిస్థితి కనిపిస్తోందా?అంటే వెంటనే సమాధానం రావడం లేదు. ఓ కాదల్ కణ్మణి వంటి సక్సెస్‌పుల్ చిత్రం తరువాత కూడా మణిరత్నం చిత్రంలో నటించడానికి యువతరం తారలు ఆలోచిస్తున్నారని ఇటీవల జరిగిన సంఘటనలు చూస్తే అర్థమవుతోంది.
 
 తాజా చిత్రానికి సిద్ధమయిన మణి చిత్రంలో నటించడానికి అంగీకరించిన దుల్కర్‌సల్మాన్, కీర్తీసురేశ్‌లు ఒకరితరువాత ఒకరు వైదొలగడం గమనార్హం. ఇలా మాలీవుడ్ తారలు హ్యాండ్ ఇవ్వడంతో మణిరత్నం ఇక బాలీవుడ్‌నే నమ్ముకున్నట్లుంది. ఉత్తరాది బ్యూటీ సైయామి ఖేర్‌తో తన తాజా చిత్రంలో కీర్తీసురేశ్ ప్లేస్‌ను భర్తీ చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం. ఈ భామ ఇప్పటికే టాలీవుడ్‌లో రేయ్ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిందన్నది గమనార్హం. సైయామిఖేర్ ప్రస్తుతం హిందీలో రాఖేశ్‌ఓంప్రకాశ్ మెహ్రా దర్శకత్వంలో మిర్జియా అనే చిత్రంలో నటిస్తోంది.
 
 ఇక ఈ అమ్మడి నేపథ్యం గురించి చెప్పాలంటే బామ్మ ఒక నాటి ప్రముఖ హిందీ నటి ఉషాకిరణ్. సైయామి తల్లి ఒక నాటి మిస్ ఇండియా ఉత్తరమట్రేఖేర్. ప్రఖ్యాత నటి షబానా ఆజ్మీ సైయామిఖేర్ ఆంటీనే. ఇకపోతే సైయామిఖేర్‌కి మణిరత్నం ఫొటో సెషన్ కూడా చేయించారట. ఇక ఓకే అనడమే తరువాయి అంటున్నారు కోలీవుడ్ వర్గాలు. ఇప్పటికే కార్తీ, నాని, నిత్యామీనన్‌లు ఎంపిక కావడంతో చిత్రం షూటింగ్‌నను డిసెంబర్‌లో సెట్‌పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మరో విషయం ఏమిటంటే ముందు అనుకున్న కథలో మణిరత్నం ఇప్పుడు చాలా మార్పులు, చేర్పులు చేశారట. ఇక ఆయన తన మెడ్రాస్ టాకీస్ పతాకంపై తెరకెక్కించనున్న ఈ చిత్ర తెలుగు వెర్షన్ బాధ్యతల్ని చిత్ర నాయకుల్లో ఒకరయిన నాని మోయనున్నట్లు వినిపిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement