షూలో 20 లక్షల బంగారం | Rs 20 lakh gold biscuits found in passenger's shoe at airport | Sakshi
Sakshi News home page

షూలో 20 లక్షల బంగారం

Aug 17 2014 9:36 AM | Updated on May 29 2019 3:19 PM

షూలో 20 లక్షల బంగారం - Sakshi

షూలో 20 లక్షల బంగారం

కోవై విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద అధికారులు రూ.20 లక్షల విలువ చేసే బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు.

తిరువొత్తియూరు: కోవై విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద అధికారులు రూ. 20 లక్షల విలువ చేసే బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్ నుంచి కోవై విమానాశ్రయానికి శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో సింగపూర్ ఏయిర్‌లైన్స్ విమానం వచ్చింది. విమానం నుంచి దిగిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఒక ప్రయాణికుడి వద్ద తనిఖీ చేయగా అతని షూలో బంగారం బిస్కెట్లను ముక్కలుగా కట్‌చేసి దాచినట్టు తెలిసింది.

అతని నుంచి 850 గ్రాముల బంగారు ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.  వీటి విలువ రూ. 20 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. విచారణలో ఆ యువకుడు తిరుపూర్ జిల్లా పట్టుకోట్టైకు చెందిన నవూస్‌ఖాన్ కుమారుడు జాహీర్‌హుస్సేన్(30) అని తెలిసింది. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement