యడ్డి... భగవద్గీతలో శ్రీకృష్ణుడు ! | Regime ... Krishna in the Bhagavad Gita! | Sakshi
Sakshi News home page

యడ్డి... భగవద్గీతలో శ్రీకృష్ణుడు !

Jan 6 2014 2:24 AM | Updated on Sep 17 2018 4:56 PM

రాజకీయాల్లో శాశ్వత శుత్రువులు ఉండరు.. శాశ్వత మిత్రులు ఉండరనేది నానుడి. మాతృసంస్థ బీజేపీ నుంచి బయటకు వచ్చిన యడ్యూరప్ప కేజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని చావుదెబ్బతీశారు.

  • మా మార్గ నిర్దేశకుడు : కేఎస్ ఈశ్వరప్ప
  •   ఆయన పెద్దరికానికి నిదర్శనం : యడ్యూరప్ప
  •   పరస్పరం పొగుడ్తలతో ముంచెత్తుకున్న నేతలు
  •  
    శివమొగ్గ, న్యూస్‌లైన్ : రాజకీయాల్లో శాశ్వత శుత్రువులు ఉండరు.. శాశ్వత మిత్రులు ఉండరనేది నానుడి. మాతృసంస్థ బీజేపీ నుంచి బయటకు వచ్చిన యడ్యూరప్ప కేజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని చావుదెబ్బతీశారు. పార్టీ అనైక్యత వల్ల కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కంగుతిన్న బీజేపీ నేతలు యడ్యూరప్ప పునరాగమానికి దారులు వెతికారు. మాతృసంస్థలో చేరడానికి ససేమిరా అన్న యడ్యూరప్ప తన రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని బీజేపీలో చేరడానికి అంగీకరించారు.

    ఇదిలా ఉంటే ఒకే వేదికపై యడ్యూరప్ప, కేఎస్ ఈశ్వరప్ప తొలిసారిగా కలిసారు. ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. ఆదివారం నగరంలోని శుభమంగళ సముదాయ భవనంలో కర్ణాటక భగవ ద్గీత అభియాన సమితి ఏర్పాటు చేసిన శ్రీమద్భగవద్గీతా సమర్పణ  సమారంభం కార్యక్రమంలో కేఎస్.ఈశ్వరప్ప ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కురుక్షేత్రంలో అర్జునుడుకి శ్రీకృష్ణుడు మార్గదర్శనం చేసినట్లు మాజీ ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప తమకు మార్గదర్శనం చేయాలన్నారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు మాదిరిగా యడ్యూరప్ప తమను ముందుండి
     
     యడ్డి... భగవద్గీతలో శ్రీకృష్ణుడు  
     
     నడిపించాలన్నారు. యడ్యూరప్ప మళ్లీ బీజేపీలో చేరిన తరువాత మొదటిసారిగా తామిద్దరం కలిసి ఈ పవిత్రమైన కార్యక్రమంలో ఒక్కటిగా కూర్చోవడం సంతోషంగా ఉందన్నారు. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని, ఆయన మళ్లీ బీజేపీలోకి రావడం స్వాగతించాల్సిన విషయమన్నారు. సమాజంలో స్త్రీలకు రక్షణ కరువైందని నైతిక విలువలు పతనం అయ్యాయని ఈ సందర్భంగా తామందరం భగవద్గీత సారాంశాన్ని తెలుసుకుని జీవితంలో ముందుకెళ్లాలని అభిప్రాయపడ్డారు.

    అన ంతరం యడ్యూరప్ప మాట్లాడుతూ... తనను శ్రీకృష్ణుడితో పోలుస్తూ కేఎస్.ఈశ్వరప్ప అనడం ఆయన పెద్దరికానికి నిదర్శనమన్నారు. బీజేపీలో మళ్లీ చేరిన తాను ఎలాంటి షరతులు పెట్టలేదని, సామాన్య కార్యకర్తగానే ఉంటానని స్పష్టం చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 19 స్థానాల్లో విజయం సాధించిందని గుర్తు చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఈ స్థానాలను అధిగమిస్తామని యడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

    రాష్ట్రంలో అత్యధిక స్ధానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి కృషి చేస్తానని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో శివమొగ్గ స్థానం నుంచి తాను పోటీ చేసే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రజాభిప్రాయం మేరకు తాను మళ్లీ బీజేపీలో చేరానని చెప్పారు. న రేంద్రమోడీ దేశ ప్రధానమంత్రి కావడం దేశ ప్రజల అభిప్రాయమని అన్నారు. బీజేపీలో తన మద్దతుదారులకు పదవులు కల్పించాలనే విషయంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ భవిష్యత్తులో అన్ని సర్దుకుంటాయని అన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement