రంజిత్ దర్శకత్వంలో ఆర్య? | Ranjith to team up with Arya next? | Sakshi
Sakshi News home page

రంజిత్ దర్శకత్వంలో ఆర్య?

Oct 9 2014 11:54 PM | Updated on Sep 2 2017 2:35 PM

రంజిత్ దర్శకత్వంలో ఆర్య?

రంజిత్ దర్శకత్వంలో ఆర్య?

అట్టకత్తి చిత్రంతో మెగాఫోన్ పట్టిన దర్శకుడు రంజిత్. తొలి చిత్రంలోనే విజయం సాధించి అట్టకత్తి దర్శకుడిగా గుర్తింపు పొందిన ఈయన మలి ప్రయత్నం కార్తీతో చేసి మెడ్రాస్ చిత్రాన్ని విజయతీరానికి చేర్చారు.

 అట్టకత్తి చిత్రంతో మెగాఫోన్ పట్టిన దర్శకుడు రంజిత్. తొలి చిత్రంలోనే విజయం సాధించి అట్టకత్తి దర్శకుడిగా గుర్తింపు పొందిన ఈయన మలి ప్రయత్నం కార్తీతో చేసి మెడ్రాస్ చిత్రాన్ని విజయతీరానికి చేర్చారు. దీంతో ఈ సక్సెస్‌ఫుల్ దర్శకుడిపై పలువురు హీరోలు కన్నేశారు. ఈయన దర్శకత్వంలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ వరుసలో నటుడు ఆర్య ముందున్నట్టు సమాచారం. రంజిత్, ఆర్య కాంబినేషన్‌లో ఆల్ ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలతో కూడిన ఒక చిత్రం తెరకెక్కనున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని ఇంతకుముందు మెడ్రాస్ చిత్రాన్ని నిర్మించిన స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం. విశేషమేమిటంటే ఈ సంస్థ బయట హీరోలతో నిర్మిస్తున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. ఇప్పటి వరకు సూర్య, కార్తీలే ఈ బ్యానర్‌లో నటించారు. ఇది వారి సొంత నిర్మాణ సంస్థ. అయితే ఆర్యతో నిర్మించనున్న ఈ చిత్రం గురించి అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం ఆర్య మిగమాన్, పొరంబోకు, మచ్చకన్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement