ఎన్నై అరిందాల్ అంటున్న అజిత్ | Parvathi Nair is the third heroine of Ajith starrer | Sakshi
Sakshi News home page

ఎన్నై అరిందాల్ అంటున్న అజిత్

Oct 31 2014 12:47 AM | Updated on Sep 2 2017 3:37 PM

ఎన్నై అరిందాల్ అంటున్న అజిత్

ఎన్నై అరిందాల్ అంటున్న అజిత్

నటుడు అజిత్ నటిస్తున్న తాజా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే విధంగా ఇది ఆయన 55వ చిత్రం కావడం మరో విశేషం.

 నటుడు అజిత్ నటిస్తున్న తాజా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే విధంగా ఇది ఆయన 55వ చిత్రం కావడం మరో విశేషం. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకుడు. అందాలభామలు అనుష్క, త్రిష హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే చిత్రంలో అదనంగా కేరళ కుట్టి పార్వతి నాయర్ వచ్చి చేరింది. ఈ అమ్మడి చిత్రంలో ముఖ్యపాత్రను పోషిస్తోందట.
 
 ఈ చిత్రం టైటిల్ ఏమిటన్న విషయం గురించి చాలాకాలంగా చాలా పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇవేమీ చిత్ర దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించినవి కావు. తాజాగా అజిత్ చిత్ర టైటిల్‌ను ప్రకటించారు. ఈ చిత్రానికి ఎన్నై అరిందాల్ అనే పేరును ఖరారు చేశారు. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకోవడంతో, వచ్చే సంక్రాంతికి విడుదల చేయడానికి దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మరో విషయం ఏమిటంటే ఈ చిత్ర నిర్మాత ఏఎం రత్నం మళ్లీ అజిత్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి వీరం చిత్రం ఫేమ్ శివ దర్శకత్వం వహించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement