డిసెంబర్ 16 ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ‘నిర్భయ’కు ఢిల్లీ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.
నిర్భయకు డీపీసీసీ నివాళులు
Dec 16 2013 11:33 PM | Updated on Oct 17 2018 5:51 PM
సాక్షి, న్యూఢిల్లీ: డిసెంబర్ 16 ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ‘నిర్భయ’కు ఢిల్లీ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. నిర్భయ ఘటన జరిగి ఏడాది అయిన సందర్భంగా సోమవారం ఉదయం ‘ఫెర్ఫామ్ టు రిఫామ్’ పేరిట ఓ సెమినార్‌ను నిర్వహించారు.డీడీయూ మార్గ్‌లోని డీపీసీసీ కార్యాలయంలో నిర్వహించిన ఈ సెమినార్‌లో ఢిల్లీ ప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు డా.ఓనికా మల్హోత్రాతోపాటు దాదాపు 300 మంది సభ్యులు పాల్గొన్నారు. మహిళల సురక్ష, న్యాయపరమైన అంశాలపై గైనకాలజిస్టు డాక్టర్ ఉషా గార్గ్, విద్యావేత్త మనిదీప్‌కౌర్, అడ్వొకేట్ సునీతా చౌహాన్ ప్రసంగించారు. ఢిల్లీవ్యాప్తంగా ఏర్పాటు చేసిన మహిళా బృందాల ద్వారా అవసరమైన సహాయం పొందవచ్చని డా.ఓనికా మల్హోత్రా పేర్కొన్నారు. మహిళల రక్షణకు మరికొన్ని చర్యలు తీసుకోవాలని వారు సూచించారు.
Advertisement
Advertisement