నిర్భయ’ సామూహిక అత్యాచారం కేసులో అపరాధులకు విధించిన ఉరిశిక్షను ధ్రువీకరించాలంటూ దిగువకోర్టు చేసిన విజ్ఞప్తిపై రాష్ట్ర హైకోర్టులో సోమవారం వాదనలు ప్రారంభం కానున్నాయి.
నిర్భయ కేసులో నేడు వాదనలు
Sep 22 2013 11:58 PM | Updated on Oct 17 2018 5:51 PM
	 న్యూఢిల్లీ: ‘నిర్భయ’ సామూహిక అత్యాచారం కేసులో అపరాధులకు విధించిన ఉరిశిక్షను ధ్రువీకరించాలంటూ దిగువకోర్టు చేసిన విజ్ఞప్తిపై రాష్ట్ర హైకోర్టులో సోమవారం వాదనలు ప్రారంభం కానున్నాయి. దీనిపై న్యాయమూర్తి రేవా ఖేత్రపాల్ విచారణ నిర్విహ స్తారు. ఈ కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు నిందితులు ముకేశ్, అక్షయ్‌ఠాకూర్, పవన్‌గుప్తా, వినయ్‌శర్మకు ఉరిశిక్ష విధిస్తూ ఈ నెల 13న తీర్పునివ్వడం తెలిసిందే. తాము విధించిన శిక్షను ధ్రువీకరించాలని అడిషనల్ సెషన్స్‌జడ్జి యోగేశ్‌ఖన్నా హైకోర్టుకు విన్నవించారు. 
	 
	 
					
					
					
					
						
					          			
						
				
	 నిబంధనల ప్రకారం దిగువకోర్టులు ఉరిశిక్షలు విధిస్తూ తీర్పు చెబితే తుదినిర్ణయం కోసం హైకోర్టును సంప్రదించడం తప్పనిసరి. ఈ కేసులో అపరాధుల ప్రవర్తన అత్యంత క్రూరంగా, పశువుల మాదిరిగా ఉందని పేర్కొంటూ దిగువకోర్టు మరణశిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో కీలక నిందితుడు రామ్‌సింగ్ తీహార్ జైలులోనే మార్చిలో ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. మైనర్ నిందితుడికి కూడా బాలల న్యాయస్థానం మూడేళ్ల శిక్ష విధించింది. నిర్భయపై గత ఏడాది డిసెంబర్ 16న సామూహిక అత్యాచారం జరగడం తెలిసిందే. చికిత్స పొందుతూ ఆమె అదే నెల 29న మరణించింది.
Advertisement
Advertisement

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
