పోర్టును సందర్శించిన నేపాల్‌ బృందం | nepal minister team visited to visakha port | Sakshi
Sakshi News home page

పోర్టును సందర్శించిన నేపాల్‌ బృందం

Oct 5 2016 11:57 AM | Updated on Sep 4 2017 4:17 PM

పోర్టును సందర్శించిన నేపాల్‌ బృందం

పోర్టును సందర్శించిన నేపాల్‌ బృందం

నేపాల్‌ రాయబారి, ఆర్థిక మంత్రి కృష్ణ హరి పుష్కర్ విశాఖ పోర్టు ట్రస్ట్‌ను సందర్శించారు.

విశాఖపట్టణం: నేపాల్‌ ప్రభుత్వ ఆర్థిక మంత్రి కృష్ణ హరి పుష్కర్, రాయబారి కృష్ణప్రసాద్‌ ఢాకల్, ఇతర సభ్యులతో కలసి మంగళవారం విశాఖ పోర్టు ట్రస్ట్‌ను సందర్శించారు. పోర్టు డిప్యూటీ చైర్మన్ హరనాథ్‌ వీరికి సాదర స్వాగతం పలికారు.

అనంతరం జరిగిన సమావేశంలో నేపాల్‌కు కంటైనర్‌ల ద్వారా సరకు ఎగుమతులను ఏవిధంగా చేయవచ్చన్న విషయాన్ని చర్చించారు. విశాఖ పోర్టులో ఉన్న మౌలిక సదుపాయాలను హరనాథ్‌ నేపాల్‌ బృందానికి వివరించారు. స్టాక్‌ హోల్డర్స్, కస్టమ్స్, రైల్వే అధికారులతో జరిపిన చర్చలు తమకు సంతృప్తిని ఇచ్చాయని బృందం తెలియజేసింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement