వంచక ప్రేమికుడితోనే యువతికి మూడుముళ్లు | Marriage With Cheating Boyfriend | Sakshi
Sakshi News home page

వంచక ప్రేమికుడితోనే యువతికి మూడుముళ్లు

Apr 7 2018 7:53 AM | Updated on Aug 1 2018 2:15 PM

Marriage With Cheating Boyfriend - Sakshi

ప్రేమజంటకు వివాహం చేసిన దృశ్యం

గౌరిబిదనూరు: యువకుడి చేతిలో మోసపోయి ఓబిడ్డకు జన్మనిచ్చిన తల్లికి అదే యువకుడితో అధికారులు మూడుముళ్లు వేయించారు. వివరాలు.. హుదుకూరు గ్రామానికి చెందిన మమత అనే యువతిని అదే గ్రామానికి చెందిన శివలింగ ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భిణిని చేశాడు. అనంతరం మొహం చాటేశాడు. ఈక్రమంలో మమత గతనెల 10న మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డ తండ్రి  ఎవరని ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో నవజాత శిశువును ముళ్లకంపల పాలుచేసింది.

ఆ శిశువు చివరకు కుక్కలపాలై  మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. బిడ్డ తల్లి మమతగా గుర్తించారు.  మహిళా సాంత్వన సహాయవాణి  అధికారి బాలగంగాధర్,  స్త్రీ,శిశు సంక్షేమశాఖ అధికారి రాజేంద్ర ప్రసాద్, రూరల్‌ ఎస్‌ఐ రవికుమార్‌లు చొరవచూపి శివలింగను పిలిపించి మాట్లాడారు. యువతిని వంచించడం సరికాదని, ఆమెను పెళ్లి చేసుకోవాలని సూచించారు. ఈమేరకు అతని కుటుంబ సభ్యులను కూడా ఒప్పించారు. అనంతరం స్థానిక సాయిబాబా దేవాలయంలో మమతకు, శివలింగకు వివాహం చేసి పెళ్లిని రిజిస్ట్రర్‌ చేయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement