రాష్ట్రవ్యాప్తంగా ‘బ్లడ్ ఆన్ కాల్’ పథకం ప్రారంభం | Maharashtra launches Jeevan Amrut Seva — 'blood-on-call' delivery service | Sakshi
Sakshi News home page

రాష్ట్రవ్యాప్తంగా ‘బ్లడ్ ఆన్ కాల్’ పథకం ప్రారంభం

Jan 7 2014 10:49 PM | Updated on Apr 3 2019 4:24 PM

ఫోన్ చేసిన గంట వ్యవధిలోగానే అవసరమైన వారికి ఇకపై రక్తం అందనుంది. బ్లడ్ ఆన్ కాల్ (జీవన్ అమృత్ సేవ) పథకాన్ని ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టింది.

ముంబై: ఫోన్ చేసిన గంట వ్యవధిలోగానే అవసరమైన వారికి ఇకపై రక్తం అందనుంది. బ్లడ్ ఆన్ కాల్ (జీవన్ అమృత్ సేవ) పథకాన్ని ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని గత ఏడాది సాతారా, సింధుదుర్గ్ జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన సంగతి విదితమే. ఆ రెండు జిల్లాల్లో ఈ పథకం విజయవంతమైన సంగతి విదితమే. నగరంలోని సర్ జే జే ఆస్పత్రిలో మంగళవార మధ్యాహ్నం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రారంభించారు.
 
 ఈ సందర్భంగా రాష్ర్ట ఆరోగ్య శాఖ మంత్రి సురేశ్‌శెట్టి మాట్లాడుతూ ఏ గ్రూపు రక్తం కావాల్సిన వారికి ఆ గ్రూపు రక్తం సత్వరమే అందుతుందన్నారు. రక్తం కావాల్సినవారు 104 నంబరులో సంప్రదించాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే రక్తం లభిస్తుందన్నారు. సేకరించిన రక్తానికి పరీక్షలు నిర్వహిస్తామని, ఆ తర్వాత వాటిని ప్యాకింగ్ చేసి అత్యంత భద్రంగా ఉంచుతామని, అవసరమైన వారికి సీల్ వేసిన కంటైనర్లలో ఉంచి సరఫరా చేస్తామని అన్నారు. ప్రస్తుతం పుణేలో 104 కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని, నాలుగు నెలలలోగా రాష్ర్టంలోని పది ప్రధాన నగరాల్లో కాల్ సెంటర్‌లను ప్రారంభిస్తామని అన్నారు.
 రవాణాచార్జీలను కొనుగోలుదారుడే భరిం చాల్సి ఉంటుందన్నారు. తొలి పది కిలోమీటర్లకు రూ. 50 చెల్లించాల్సి ఉంటుందన్నారు. కాగా రాష్ర్టంలో అనుమతి పొందిన రక్తనిధి కేంద్రాలు 250 దాకా ఉన్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement