తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని ఓ ప్రేమ జంట అత్మహత్యకు పాల్పడింది.
దీంతో జీవితంపై విరక్తి చెందిన ప్రేమికులు మంగళవారం ఉదయం ఇంట్లో నుంచి పారిపోయారు. బుధవారం వడమధురై సమీపంలోని అడవిలో చెట్టుకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పశువుల మేతకు వెళ్లిన వారు విషయాన్ని గ్రామంలో చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంగల్ సీఐ కుమార్, ఎస్‌ఐ సత్యభామ సంఘటన స్థలానికి వచ్చి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.