రాష్ట్ర ఓటర్ల జాబితాలో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వినర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరు, వివరాలు సరిగానే ఉందని ఎన్నికల కమిషన్ బుధవారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది.
న్యూఢిల్లీ: రాష్ట్ర ఓటర్ల జాబితాలో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వినర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరు, వివరాలు సరిగానే ఉందని ఎన్నికల కమిషన్ బుధవారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. శనివారం జరగబోయే ఎన్నికల బరిలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్కు ఇది ఊరట కలిగించే అంశమే. జస్టిస్ విభు బక్త్రు కేజ్రీవాల్పై వచ్చిన ఆరోపణలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లగా, ఈ మేరకు ఈసీ క్లీన్ చిట్ ఇచ్చింది.
న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాలో ఆప్ కన్వినర్ కేజ్రీవాల్ పేరు తప్పుగా ఉందని, ఆయన ఆ రాష్ట్రం వారు కాదని ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ నేత కిరణ్ వాలియ, మౌలిక్ భారత్ ట్రస్ట్ ఎన్జీఓ కేజ్రీవాల్ అభ్యర్థిత్వం చట్టబద్ధం కాదని హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఉత్తరప్రదేశ్ వాసిగా ఉంటూ న్యూఢిల్లీ అసెంబ్లీకి ఎలా పోటీచేస్తారని కేజ్రీవాల్ పై పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.