ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం బీజేపీ జగ్‌దీశ్ ముఖిని బరిలోకి దింపడంతో స్పీకర్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ స్పీకర్,
నేడు స్పీకర్ ఎన్నిక
Jan 2 2014 11:13 PM | Updated on Oct 17 2018 6:27 PM
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం బీజేపీ జగ్‌దీశ్ ముఖిని బరిలోకి దింపడంతో స్పీకర్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక శుక్రవారం జరుగనుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన జంగ్‌పురా ఎమ్మెల్యే ఎం.ఎస్. ధీర్, బీజేపీ తరఫున జగ్‌దీశ్ ముఖి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఢిల్లీలో మైనారిటీ ప్రభుత్వం కొనసాగుతున్నందువల్ల అసెంబ్లీ స్పీకర్ పదవి ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఈ పదవిని దక్కించుకుని అసెంబ్లీలో తమది పైచేయి చేసుకోవడానికి పోటీపడుతున్నాయి. ఆప్‌కి బయటి నుంచి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ స్పీకర్ ఎన్నికపై తన వైఖరిని స్పష్టం చేయలేదు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కోరితేనే స్పీకర్ ఎన్నికలో ఆప్‌కి మద్దతు ఇస్తానని ఆ పార్టీ అంటోంది.
Advertisement
Advertisement