‘నడిపే’ తీరు మారలా..? | Increase of rash driving | Sakshi
Sakshi News home page

‘నడిపే’ తీరు మారలా..?

May 3 2015 11:17 PM | Updated on Oct 20 2018 5:53 PM

ముంబై మహానగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం రోజు రోజుకీ ఎక్కువవుతోంది...

- గత జనవరి-మార్చిలో 5.3 లక్షలు.. ఈసారి 5.9 లక్షల కేసుల నమోదు
- రెట్టింపైన ర్యాష్ డ్రైవింగ్.. ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ తగ్గుదల
సాక్షి, ముంబై:
ముంబై మహానగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం రోజు రోజుకీ ఎక్కువవుతోంది. గతేడాది జనవరి నుంచి మార్చి వరకు జరిగిన నేరాలతో పోలిస్తే, ఈ యేడాది మార్చి వరకు 24,800 నేరాలు ఎక్కువగా నమోదయ్యాయి. గతేడాదితో పోల్చితే ర్యాష్ డ్రైవింగ్ కేసులు ఈ ఏడాది రెట్టింపయ్యాయి. గత జనవరి నుంచి మార్చి వరకు ర్యాష్ డ్రైవింగ్‌కు సంబంధించి కేసులు 1,610 నమోదు కాగా, ఈ ఏడాది ఇదే సమయంలో 3,788 కేసులు నమోదయ్యాయి.

ట్రాఫిక్ ఉల్లంఘన కేసుల్లో హెల్మెట్ లేకుండా పట్టుబడ్డ వారు 64 శాతం, మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేసిన వారు 33 శాతం, ముబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ నడిపినవారు 21 శాతం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ప్రయాణికులు 58 శాతం పెరిగారు. గత జనవరి నుంచి మార్చి మధ్యలో ట్రాఫిక్ కేసులు 5.3 లక్షలు నమోదవగా, రూ.5.5 కోట్లు జరిమానా రూపంలో వసూలు చేశారు. ఈ ఏడాది ఇదే సమయంలో 5.6 లక్షల కేసులు నమోదయ్యాయి. రూ.5.9 కోట్లను వసూల్లు చేశారు. ఈ విషయమై ఎన్విరాన్‌మెంట్ సోషల్ నెట్‌వర్క్‌కు చెందిన అశోక్ దాతర్ మాట్లాడుతూ.. వాహనదారులకు చట్టం అంటే భయం లేదని, జరిమానా ఎక్కువ మొత్తంలో విధించి వారి జేబులు ఖాళీ చేయించాలన్నారు. మద్యం సేవించి వాహనం నడిపే వారిపై రూ. 2000 జరిమానా విధించడం, చెల్లించకపోతే రాత్రం తా లాకప్‌లో ఉంచడం లాంటి కఠిన శిక్షలు అమలు చేయడం వల్ల సంఖ్య తగ్గిందన్నారు.

ప్రస్తుతం నవీముంబై ట్రాఫిక్ విభాగం ఈ-చలాన్ అమలులోకి వచ్చింది. త్వరలో నగరంలో దీన్ని అమలుచేయనున్నారు. జరిమానా చెల్లించేందుకు వాహనదారులు డెబి ట్, క్రెడిట్ కార్డులుఉపయోగించుకునేందు వీ లుగా కూడా విధంగా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. సెంట్రల్ మోటర్ వెహికిల్స్ కోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందించనున్నామని ఇటీవల రాష్ట్ర రవాణా శాఖ ప్రకటించింది. వేగంగా డ్రైవింగ్ చేసిన వారికి రూ. 300, సిగ్నల్ దాటడం, లేన్-కట్టింగ్, నో పార్కింగ్ జోన్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసిన వారికి రూ.100 జరిమానా వసూలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement