వీపెక్కిన దర్శన్‌ | Hero Darshan Fan Tattoo On Hes Body in Karnataka | Sakshi
Sakshi News home page

వీపెక్కిన దర్శన్‌

Jan 30 2019 12:37 PM | Updated on Jan 30 2019 12:37 PM

Hero Darshan Fan Tattoo On Hes Body in Karnataka - Sakshi

అభిమాని వీపుపై దర్శన్‌ పచ్చబొట్టు చిత్రం

యశవంతపుర: అభిమానానికి హద్దులుండవు. తమ మనసు మెచ్చిన హీరో, లేదా నాయకుడి చిత్రాలను తలపై, శరీరంపై వేయించుకుంటూ ఉంటారు. అదే కోవలో ప్రముఖ బహుభాషా నటుడు దర్శన్‌ అభిమాని ఒకరు ఆయన ఫోటోను వీపుపై వేయించుకుని తన అభిమానాన్ని చాటుకున్నారు. బెంగళూరుకు చెందిన ఆనందరామ్‌ అనే అభిమాని వీపుపై దర్శన్‌ చిత్రాన్ని పచ్చబొట్టుగా వేయించుకోవడం ఆసక్తికరంగా మారింది. దర్శన్‌ నటించిన ‘యజమాన్రు’ సినిమా టైటిల్‌నుకూడా రాయించుకున్నాడు. ఆనందరామ్‌ కరునాడ కులదీప దర్శన్‌ తూగుదీప అభిమాని సంఘం అధ్యక్షుడు. తన వీపుపై దర్శన్‌ వెలసిన చిత్రాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయటంతో వైరల్‌ అయ్యాయి. దీనిని అనేక మంది అభిమాను షేర్‌ చేసి ఆనందరామ్‌కు అభినందనలు తెలుపుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement