న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అభ్యర్థిగా డాక్టర్ హర్షవర్ధన్‌కు అవకాశం రాకుండా గోయల్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అధిష్టానం మాత్రం ఆయనవైపే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.
త్వరలోనే హర్షవర్దన్ పేరు ప్రకటన
Oct 22 2013 12:29 AM | Updated on Sep 1 2017 11:50 PM
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అభ్యర్థిగా డాక్టర్ హర్షవర్ధన్‌కు అవకాశం రాకుండా గోయల్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అధిష్టానం మాత్రం ఆయనవైపే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరులోపే హర్షవర్ధన్ పేరును లాంఛనంగా ప్రకటించనున్నట్టు సమాచారం. ఆదివారం నాటి పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం సమావేశంలో అధిష్టానం ఈ మేరకు సంకేతాలు పంపింది.
అయితే బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ విదేశీ పర్యటన కారణంగా ఈ సమావేశానికి రాకపోవడంతో తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ నెల 31న నిర్వహించే పార్లమెంటు బోర్డు భేటీలో హర్షవర్ధన్ పేరును అధికారికంగా ప్రకటిస్తారని బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీతోపాటు సీనియర్లు ఎల్‌కే అద్వానీ, జైట్లీ, ఆర్‌ఎస్‌ఎస్ కూడా హర్షవర్ధన్‌వైపే మొగ్గుచూపడమే ఈ పరిస్థితికి కారణం.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత, మరో సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ కూడా హర్షవర్ధన్‌కు మద్దతు ప్రకటించడంతో గోయల్ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారింది. రాజీనామా చేసినా దానిని ఆమోదిస్తామని అధిష్టానం గోయల్‌ను హెచ్చరించడంతో ఆయన వెనక్కి తగ్గినట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి.
Advertisement
Advertisement