ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అనంతపురం జిల్లాలో మంగళవారం విస్తృతంగా పర్యటించారు.
అనంతలో గవర్నర్ విస్తృత పర్యటన
May 23 2017 1:42 PM | Updated on Aug 21 2018 11:41 AM
అనంతపురం: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అనంతపురం జిల్లాలో మంగళవారం విస్తృతంగా పర్యటించారు. గార్లదిన్నె మండలం ముకుందాపురం గ్రామంలో పంట సంజీవని కార్యక్రమాన్ని పరిశీలించారు. ప్రభుత్వ సహకారంతో రైతులు ఏర్పాటు చేసుకున్న ఫాం పాండ్సును పరిశీలించి కరవు ప్రాంతాల్లో పంట కుంటల ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం బిందు, తుంపర సేద్య పద్ధతులను, అంజూర, చీనీ పంట ఉత్పత్తులు, మల్చింగ్ విధానం గురించి తెలుసుకున్నారు. ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించారు. తాగునీటి సమస్యలను కొందరు గ్రామస్తులు నరసింహన్ దృష్టికి తెచ్చారు. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా శింగనమల నియోజకవర్గానికి సైతం నీరు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే యామినిబాల గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.
Advertisement
Advertisement