మరుగుదొడ్ల నిర్మాణాలకు నిధులు | Funding for the construction of toilets | Sakshi
Sakshi News home page

మరుగుదొడ్ల నిర్మాణాలకు నిధులు

Dec 12 2013 2:52 AM | Updated on Aug 28 2018 5:25 PM

తిరువళ్లూరు యూనియన్ పరిధిలోని 23 పాఠశాలలకు మరుగుదొడ్ల్లను నిర్మించాలని నిర్ణయించిన అధికారులు అందుకోసం రూ.23 లక్షల చెక్కులను

 తిరువళ్లూరు, న్యూస్‌లైన్:తిరువళ్లూరు యూనియన్ పరిధిలోని 23 పాఠశాలలకు మరుగుదొడ్ల్లను నిర్మించాలని నిర్ణయించిన అధికారులు అందుకోసం రూ.23 లక్షల చెక్కులను ఆయా పాఠశాలలకు అందజేసారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు లేని పాఠశాలలను గుర్తించి వారికి వసతుల కల్పన కోసం సర్వశిక్ష అభియాన్ పథకం క్రింద  నిధులు పంపిణీ చేసే కార్యక్రమం బుధవారం ఉదయం ఈకాడు ప్రాంతంలో జరిగింది. కార్యక్రమానికి  సర్వశిక్ష అభియాన్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, తిరువళ్లూరు యూనియన్ చైర్మన్ పుట్లూరు చంద్రశే ఖర్ హాజరై నిధులను పంపిణీ చేశారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆరు నెలల్లో ఇచ్చిన నిధులతో మరుగుదొడ్లను నిర్మించాలని ఆయన కోరారు. మరుగు     దొడ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేయడంతో పాటు నాణ్యతగా నిర్మించాలని ఆయన సూచించారు.  జిల్లా కౌన్సిలర్లు  బొమ్మి, సెల్వకుమారి, ఉపాధ్యక్షుడు శక్త్తి రమేష్, ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర కార్యదర్శి దాస్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement