సినీ నటుల దిష్టిబొమ్మల దహనం | Film stars Burning effigies actors | Sakshi
Sakshi News home page

సినీ నటుల దిష్టిబొమ్మల దహనం

Jun 25 2016 9:32 PM | Updated on Sep 4 2017 3:23 AM

సినీ నటుల దిష్టిబొమ్మల దహనం

సినీ నటుల దిష్టిబొమ్మల దహనం

చిట్‌పండ్ అక్రమాల్లో పాలుపంచుకున్నారని ఆరోపిస్తూ ఒడియా సినీ నటులు పప్పు పంపం, సిద్ధాంత్ మహాపాత్రో, అనుభవ్, ఆకాశ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.

రాయగడ జిల్లా : చిట్‌పండ్ అక్రమాల్లో పాలుపంచుకున్నారని ఆరోపిస్తూ ఒడియా సినీ నటులు పప్పు పంపం, సిద్ధాంత్ మహాపాత్రో, అనుభవ్, ఆకాశ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. శుక్రవారం రాయగడ జిల్లా బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో కపిలాస్ జంక్షన్‌లో చిట్‌ఫండ్ అక్రమాల్లో భాగస్వాములైన సినీ నటుల దిష్టిబొమ్మలు దహనం చేశారు.
 
  ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ  అధికార పార్టీ బీజేడీలో ఉంటూ ప్రజల డబ్బులు స్వాహా చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో నవీన్ ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోయిందన్నారు. చిట్‌ఫండ్ , గనులు, ఖనిజం, పప్పుధాన్యాల్లో అక్రమాలకు పాల్పడ్డారని, భూకబ్జాలకు బీజేడీ నాయకులు పాల్పడుతున్నారని ఆరోపించారు.
 
  స్వచ్ఛమైన పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన బీజేడీ అవినీతి అక్రమాలమయమైందన్నారు. పద్నాలుగేళ్లుగా అధికారంలో ఉన్నా మాతృభాష రాని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్ర ప్రజలకు ఎలా పాలన అందించగలరని ప్రశ్నించారు.  కార్యక్రమంలో బీజేపీ యువమోర్చా సభాపతి, భాస్కర నాయక్, హోల్దార్ మిశ్రో, లక్ష్మీపట్నాయక్, శ్రీఫాల్‌జైన్, సుశాంత్ మహరాణా, కె.అశ్వని, తిలక్‌చౌదురి పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement