జిల్లా కలెక్టర్ కార్యాలయం పేరుతో పేదల భూముల్ని ఆక్రమించడానికి నిరసనగా.. రైతులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు.
మహబూబాబాద్ కలెక్టరేట్ భూముల కలకలం
May 11 2017 12:38 PM | Updated on Jun 4 2019 5:16 PM
మహబూబాబాద్: జిల్లా కలెక్టర్ కార్యాలయం పేరుతో పేదల భూముల్ని ఆక్రమించడానికి నిరసనగా.. రైతులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. పురుగుల మందు డబ్బాలతో నేషనల్ హైవేపై బైఠాయించి ధర్నా చేపడుతున్నారు. జిల్లాలోని సాలర్ తండా శివారులోని భూముల్లో కలక్టరేట్ కొరకు భూ సేకరణ జరిపారు. ఇది రైతులు, నిరుపేదల అభిష్టానికి విరుద్ధంగా.. బలవంతంగా తీసుకున్నారని ఆరోపిస్తూ.. గురువారం ఉదయం రాస్తారోకో నిర్వహించారు. దీంతో హైవేపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
Advertisement
Advertisement