సెప్టెంబర్ 12న ‘డూసూ’ ఎన్నికలు | DUSU polls to be held on 12th September | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్ 12న ‘డూసూ’ ఎన్నికలు

Aug 7 2014 10:49 PM | Updated on Mar 29 2019 9:24 PM

ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలు సెప్టెంబర్ 12న జరుగనున్నాయి. దీంతో విద్యార్థి సంఘాలు చురుకుగా మారాయి. ఆయా సంఘాలు వర్సిటీ అనుబంధ

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలు సెప్టెంబర్ 12న జరుగనున్నాయి. దీంతో  విద్యార్థి సంఘాలు చురుకుగా మారాయి. ఆయా సంఘాలు వర్సిటీ అనుబంధ కళాశాలల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి.సభ్యత్వ నమోదు, కరపత్రాల పంపిణీ వంటి పనులలో కార్యకర్తలు తలమునకలైపోయారు. అభ్యర్థుల జాబితాను ఖరారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. డూసూ ఎన్నికలు అటు కాంగ్రెస్‌కు చెందిన ఎన్‌ఎస్‌యూఐకి, ఇటు బీజేపీకి చెందిన ఏబీవీపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయంతో దెబ్బతిన్న ఎన్‌ఎస్‌యుఐ డూసూ ఎన్నికల్లో తన సత్తా చూపాలని చూస్తుండగా, ఏబీవీపీ తన జోరు కొనసాగించాలనుకుంటోంది. ఈ రెండు విద్యార్థి సంఘాలతో పాటు ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా) కూడా కొన్ని పదవులు దక్కిం చుకోవడం కోసం గట్టిగా ప్రయత్నించనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement