ఎక్స్ప్రెస్వేలో మహిళను వెంటాడి.. | Delhi woman chased and shot after a brawl on the Delhi-Gurgaon Expressway | Sakshi
Sakshi News home page

ఎక్స్ప్రెస్వేలో మహిళను వెంటాడి..

Apr 19 2016 2:23 PM | Updated on Sep 3 2017 10:16 PM

ఎక్స్ప్రెస్వేలో మహిళను వెంటాడి..

ఎక్స్ప్రెస్వేలో మహిళను వెంటాడి..

అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఆగ్రహించిన ఓ మహిళను దుండగులు వేటాడి, ఆమెపై కాల్పులు జరిపారు.

 న్యూఢిల్లీ: అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఆగ్రహించిన ఓ మహిళను దుండగులు వేటాడి, ఆమెపై కాల్పులు జరిపారు.  ఢిల్లీ-గుర్గావ్ ఎక్స్ప్రెస్వేలో ఈ దారుణం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.

ఆదివారం రాత్రి ఢిల్లీకి చెందిన ఆరుగురు స్కార్పియో వాహనంలో వెళ్తున్నారు. వీరిలో సిద్దాంత్ ఠాకూర్, దేవిశ్రీ, అసిస్టెంట్ జైలర్ సునీల్ కుమార్, ఆడిటర్ సంజీవ్ కుమార్ మరో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. దారి మధ్యలో ఓ మద్యం షాపు వద్ద ముగ్గురు వ్యక్తులు కారులో ఉన్న మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీంతో కారులో ఉన్న మహిళ ఎదురుతిరిగి ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పుడు ఏమీ మాట్లాడకుండా వెళ్లిన అపరిచితులు కాసేపటి తర్వాత మరో ఇద్దరిని తీసుకుని స్కార్పియోను వెంబడించారు. ఐఫ్కో చౌక్ వద్ద దుండగులు స్కార్పియో అద్దాలను బేస్ బాల్ బ్యాట్లతో పగలగొట్టారు. లోపల ఉన్న సిద్ధాంత్, దేవిశ్రీలపై కాల్పులు జరిపి పారిపోయారు. సందీప్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన సిద్ధాంత్, దేవిశ్రీ గురుగ్రామ్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement