వైద్య ఖర్చులు తగ్గించడమే లక్ష్యం: చంద్రబాబు | CM Chandrababu Naidu holds teleconference with Health department | Sakshi
Sakshi News home page

వైద్య ఖర్చులు తగ్గించడమే లక్ష్యం: చంద్రబాబు

Apr 25 2017 11:22 AM | Updated on Aug 18 2018 5:57 PM

వైద్య ఆరోగ్య ఖర్చులు ప్రతి పేద కుటుంబంపై పెను భారంగా మారాయి.. వాటిని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

అమరావతి: వైద్య ఆరోగ్య ఖర్చులు ప్రతి పేద కుటుంబంపై పెను భారంగా మారాయి.. వాటిని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఆయన మంగళవారం వైద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లతో టెలికాన్షరెన్స్‌ నిర్వహించారు. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలి. పరిసరాల పరిశుభ్రతపైనే ప్రజారోగ్యం ఆధారపడి ఉంటుంది. తాగునీరు, పీల్చే గాలి మన ఆర్యోగాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి.. ఆరోగ్యంపై ఖర్చు తగ్గించడంపై ప్రత్యేక దృష్టి సారించాలి. ‘ఆనంద ఆదివారం’ కార్యక్రమ లక్ష్యం కూడా ఇదే. పాఠశాలల్లో యోగ, కూచిపూడి ప్రవేశపెట్టింది ఆరోగ్యం, ఆనందం కోసమేనని అధికారులకు దిశానిర్దేశం చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement