విశాల్, క్యాథరిన్ లిప్‌లాక్‌కు కత్తెర | Censor Board cut Vishal Catherine tresa lip lock | Sakshi
Sakshi News home page

విశాల్, క్యాథరిన్ లిప్‌లాక్‌కు కత్తెర

Dec 31 2015 2:43 AM | Updated on Sep 3 2017 2:49 PM

విశాల్, క్యాథరిన్ లిప్‌లాక్‌కు కత్తెర

విశాల్, క్యాథరిన్ లిప్‌లాక్‌కు కత్తెర

నటుడు విశాల్ నటి క్యాథరిన్ ట్రెసాల లిప్‌లాక్ కిస్‌లకు సెన్సార్ కత్తెర వేసింది. విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కథాకళి.

నటుడు విశాల్ నటి క్యాథరిన్ ట్రెసాల లిప్‌లాక్ కిస్‌లకు సెన్సార్ కత్తెర వేసింది. విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కథాకళి. మెడ్రాస్ చిత్రం ఫేమ్ క్యాథరిన్ ట్రెసా నాయకిగా నటించిన ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకుడు. రెజీనా కస్సాంద్ర, నాజర్, కరుణాస్, సూరి, శ్రీజిత్ రవి, లక్ష్మి రామక్రిష్ణన్ పోషించిన ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీత బాణీలు అందించారు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సంక్రాంతికి బరిలోకి దూకడానికి సిద్ధమవుతున్న కథాకళి చిత్రాన్ని సెన్సార్‌కు పంపనున్నారు. ఈచిత్రంలో హీరో హీరోయిన్ల మధ్య లిప్‌లాక్ దృశ్యాలు చోటు చేసుకున్నాయట.
 
 ఆ సన్నివేశాలను ముందుగానే ట్రైలర్‌లో జోడించి సెన్సార్‌కు పంపగా అక్కడ సెన్సార్ సభ్యులు ఆ సన్నివేశాలను నిర్దాక్షణ్యంగా కట్ చేసి విశాల్ క్యాథరిన్ ట్రెసాల చుంబనాలకు దగ్గరయ్యే వరకూ సన్నివేశాలు ఉంచి మిగతావి కట్ చేసి ట్రైలర్‌ను చేతిలో పెట్టారట. దాన్నే ప్రచారం చేస్తున్న చిత్ర యూనిట్ ఇప్పుడు మెయిన్ చిత్రంలో అలాంటి సన్నివేశాలు లేకుండా ముందుగానే జాగ్రత్త పడుతున్నారని సమాచారం. లవ్,కామెడీ, యాక్షన్, అంటూ పక్కా కమర్షియల్ అంశాలతో తెరకెక్కించిన చిత్రం కథాకళి అంటున్నారు చిత్రవర్గాలు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement