తెలంగాణలో అమిత్‌షా మూడు రోజుల పర్యటన ఖరారైనట్లు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు.
తెలంగాణలో అమిత్‌షా పర్యటన ఖరారు
May 12 2017 12:54 PM | Updated on Mar 29 2019 9:31 PM
హైదరాబాద్: తెలంగాణలో అమిత్‌షా మూడు రోజుల పర్యటన ఖరారైనట్లు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. ఈ నెల 22, 23, 24 తేదీల్లో అమిత్‌షా పర్యటిస్తారని, తన పర్యటనలో అన్ని జిల్లాల అధ్యక్షులతో, ఆఫీస్ బేరర్లతో ఆయన సమావేశమవుతారని చెప్పారు. అమిత్‌షా పర్యటన తర్వాత తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారటం ఖాయమన్నారు. పేద ముస్లింల మద్దతుతో హైదరాబాద్ పార్లమెంట్ సీటును గెలుచుకుంటామన్నారు.
బీజేపీలో చేరికలు నిరంతర ప్రక్రియ అని, ఒంటరిగానే బలపడతాం.. ఒంటరిగానే పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ నీటి బుడగ లాంటిదని చెప్పారు. తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉందంటూ ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ సిద్ధమని అన్నారు. ఈనెల 29 నుంచి జూన్ 15 వరకు తెలంగాణలో విస్తార యోజన పేరిట పల్లెపల్లెకు బీజేపీ.. ఇంటింటికి మోడీ బాట పట్టనున్నామని, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించి మోడీ అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తామని లక్ష్మణ్ వివరించారు.
Advertisement
Advertisement