కేంద్ర ప్రభుత్వం సవరించిన ఆదాయ పన్ను చట్టంలో బంగారం బలవంతపు జప్తు, పన్ను విధింపు వంటి నిబంధనలు లేవని ఏపీ బీజేపీ మహిళా మోర్చ అధ్యక్షురాలు మాలతి రాణి అన్నారు.
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సవరించిన ఆదాయ పన్ను చట్టంలో బంగారం బలవంతపు జప్తు, పన్ను విధింపు వంటి నిబంధనలు ఏవీ లేవని ఏపీ బీజేపీ మహిళా మోర్చ అధ్యక్షురాలు మాలతి రాణి అన్నారు. ఆదివారం ఆమె ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రం బంగారం విషయంలో కొత్త నిబంధనలు ఏవీ ప్రవేశపెట్టలేదని, గతంలో ఉన్న నిబంధనలనే మరోసారి పునరుద్ఘటించిందని పేర్కొన్నారు.
ఈ విషయంలో కొంత మంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వదంతులను నమ్మోద్దని ఆమె కోరారు. నల్లధనంతో కొనుగోలు చేసిన బంగారం లెక్క మాత్రమే చూపాలని కేంద్రం కోరిందన్నారు. పెద్దనోట్ల రద్దు వల్ల రానున్న రోజుల్లో దేశానికి మంచి జరుగుతుందని ఆమె అన్నారు.