బీజేపీ నేత దారుణహత్య | BJP leader murder in karnataka | Sakshi
Sakshi News home page

బీజేపీ నేత దారుణహత్య

Jun 2 2017 11:46 AM | Updated on Mar 29 2019 9:07 PM

బీజేపీ నేత దారుణహత్య - Sakshi

బీజేపీ నేత దారుణహత్య

బుధవారం రాత్రి బీజేపీ నేత దారుణహత్యకు గురయ్యాడు.

► పెళ్లి పత్రికలు ఇచ్చి వస్తుండగా మారణాయుధాలతో దాడి
► అక్కడికక్కడే మృతి చెందిన ఆనేకల్‌ ఎస్సీ, ఎస్టీ విభాగం ఉపాధ్యక్షుడు హరీష్‌


బొమ్మనహళ్లి : రెండు నెలల క్రితం చందాపుర సమీపంలోని బొమ్మసంద్ర వద్ద నడి రోడ్డుపై బీజేపీ నగర సభ సభ్యుడు వాసు హత్య సంఘటన మరువకముందే బుధవారం రాత్రి మరో బీజేపీ నేత దారుణహత్యకు గురయ్యాడు. బీజేపీ ఆనేకల్‌ తాలూకా ఎస్సీ, ఎస్టీ విభాగం ఉపాధ్యక్షుడు, హిలలీగ గ్రామానికి చెందిన హరీష్‌ (40)ను స్థానికంగా ఉండే వారే దారుణంగా హత్య చేశారు. వివరాలు... హరీష్‌ తమ్ముడి పెళ్లి సందర్భంగా స్నేహితులకు పెళ్లిపత్రికలు ఇచ్చి అర్ధరాత్రి బైక్‌పై తిరిగి వస్తుండగా గుర్తు తెలియని దుండగులు చందాపుర సమీపంలోని హిలలిగ గేట్‌ వద్ద అడ్డుకుని అతని కళ్లల్లో కారం చల్లి మారణాయుధాలతో నరికి పారిపోయారు.

సమాచారం అందుకున్న సూర్యసిటీ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్పర్శ ఆస్పత్రికి తరలించారు. కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్త కూడా అయిన హరీష్‌కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండు రోజుల క్రితం హిళలిగ గ్రామానికి చెందిన కిషోర్, సందీప్, రాజేష్‌లతో హరీష్‌ ఘర్షణ పడినట్లు సమాచారం. కక్షతోనే వారు హరీష్‌ను హత్య చేసి ఉంటారని ఆగ్రహంతో బీజేపీ కార్యకర్తలు వీరి ఇళ్లపై రాళ్ల దాడికి దిగారు. అక్కడే ఉన్న వాహనాలకు నిప్పు పెట్టడానికి యత్నించగా పోలీసులు అడ్డుకోవడం పెను ప్రమాదం తప్పింది. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్‌పీ అమిత్‌ సింగ్‌ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement