ఆమెను చూడొద్దంటూ వార్నింగ్‌ ఇచ్చాడు: రోహిత్‌ | Yuvraj Singh warned Rohit Sharma to stay away from Ritika | Sakshi
Sakshi News home page

ఆమెను చూడొద్దంటూ వార్నింగ్‌ ఇచ్చాడు: రోహిత్‌

Dec 26 2017 3:37 PM | Updated on Nov 9 2018 6:46 PM

Yuvraj Singh warned Rohit Sharma to stay away from Ritika - Sakshi

న్యూఢిల్లీ: గతంలో ఒకానొక సందర్భంలో తనకు  యువరాజ్‌ సింగ్‌ సరదాగా వార్నింగ్‌ ఇచ్చిన విషయాన్ని రోహిత్‌ శర్మ తాజాగా వెల్లడించాడు.  కొన్నేళ్ల క్రితం భారత క్రికెట్‌ జట్టు షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలో తొలిసారి రితికని చూసిన రోహిత్ శర్మ.. ఆమె వైపే తదేకంగా చూస్తుండటంతో అక్కడే ఉన్న యువరాజ్ సింగ్ 'అలా చూడొద్దు.. ఆమె నా చెల్లిలాంటిది' అని హెచ్చరించాడట. ఈ విషయాన్ని 'బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్' కార్యక్రమంలో రోహిత్‌ బయటపెట్టాడు. అయితే ఈ వార్నింగ్‌ తనలో మరింత పట్టుదల పెంచిందని పేర్కొన్న రోహిత్‌.. ఆపై అలా ఆమెను చూస్తూ ఉండిపోయానని  ఆనాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు.

'యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ ఫఠాన్‌లతో కలిసి ఓ ప్రకటన షూటింగ్‌ కోసం నేను వెళ్లాను. అక్కడే తొలిసారి రితికని చూశాను. అప్పటికే యువీ, రితిక మంచి స్నేహితులు కావడంతో వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు. కాగా, వారికి కొంచెం దూరంగా కూర్చున్న నేను.. అక్కడ నుంచే రితికని తదేకంగా చూడటం మొదలెట్టాను. నా తీరుని గమనించిన యువరాజ్ సింగ్.. అలా చూడొద్దు ఆమె నా చెల్లిలాంటిది' అని వార్నింగ్‌ ఇచ్చాడని రోహిత్‌ తెలిపాడు. ఆ తరువాత రితికతో జరిగిన సంభాషణతో మంచి స్నేహితులుగా మారిపోయామన్నాడు. అదే తమ వివాహానికి దారి తీసిందన్నాడు.. 2015, డిసెంబర్‌ 13వ తేదీన రితికను రోహిత్‌ శర్మ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement