ఆసీస్‌తో మ్యాచ్‌: కొత్త గ్లోవ్స్‌తో ధోని | World Cup 2019 Dhoni Changes Wicketkeeping Gloves | Sakshi
Sakshi News home page

ఆసీస్‌తో మ్యాచ్‌: కొత్త గ్లోవ్స్‌తో ధోని

Jun 9 2019 9:39 PM | Updated on Dec 21 2020 1:02 PM

World Cup 2019 Dhoni Changes Wicketkeeping Gloves - Sakshi

గొడవెందుకని.. కొత్త గ్లోవ్స్‌తో బరిలోకి దిగిన ధోని

లండన్‌ : ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ సారథి, వికెట్‌ కీపర్‌ ఎంఎస్‌ ధోని ధరించిన గ్లోవ్స్‌ పెద్ద చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. బలిదాన్(త్యాగం) చిహ్నం కలిగిన కీపింగ్‌ గ్లోవ్స్‌ వాడటంపై ఐసీసీ అభ్యంతరం తెలిపింది. దీంతో బీసీసీఐతో సహా యావత్‌ భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీసీసీఐ కూడా ధోని గ్లోవ్స్‌ మార్చవలసిన అవసరం లేదని, ఐసీసీతో మాట్లాడతామని పేర్కొంది. అయితే నిబంధనల ప్రకారం తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఐసీసీ స్పష్టం చేసింది.

దీంతో చేసేదేమి లేక బలిదాన్‌ గ్లోవ్స్‌పై ధోని మనసు మార్చుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరగుతున్న మ్యాచ్‌లో ఆ చిహ్నం లేని గ్లోవ్స్‌ను వేసుకుని ఆడాడు. ఇక నేటి మ్యాచ్‌లో బలిదాన్‌ ఉన్న గ్లోవ్స్‌నే ధోని వాడతాడని, అయితే చిహ్నాలు కనిపించకుండా స్టిక్కర్లు అతికించి అవకాశముందని ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఇక రాద్దాంతం చేయడం ఇష్టం లేని ధోని కొత్త గ్లోవ్స్‌తోనే మ్యాచ్‌ బరిలోకి దిగాడు. ఇక దీనిపై ఫ్యాన్స్‌ ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement