‘షీలా కి జవాని’కి వార్నర్‌ ఇరగదీశాడు.. | Warner, Daughter Indi Dance To Katrina Kaif's Blockbuster Song | Sakshi
Sakshi News home page

‘షీలా కి జవాని’కి వార్నర్‌ ఇరగదీశాడు..

Apr 18 2020 3:29 PM | Updated on Apr 18 2020 3:47 PM

Warner, Daughter Indi Dance To Katrina Kaif's Blockbuster Song - Sakshi

సిడ్నీ: కరోనా వైరస్ విజృంభణతో యావత్ ప్రపంచం అతలాకుతలం అవుతుండగా.. క్రీడా టోర్నీలన్నీ రద్దయ్యాయి. ఈ ప్రాణాంతక వైరస్ కట్టడికి యావత్ దేశాలు లాక్‌డౌన్ పాటిస్తున్నాయి. దీంతో స్టార్ క్రికెటర్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్వారంటైన్ సమయాన్ని కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తున్నారు. దాంతో చేసేది లేక ఇండోర్‌లోనే రకరకాల ఆట పాటలతో అలరిస్తున్నారు.(వివాదాలు వద్దు.. ఆ ట్వీట్‌ను తీసేయ్‌!)

దీనిలో భాగంగా ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన కూతుళ్లతో కలిసి టిక్‌టాక్‌ వీడియోలు చేసుకుంటున్నాడు. మూడు రోజుల క్రితం తన  కుమార్తె ఇవీతో కలిసి చేసిన వీడియోకి ఎవరైనా తమకు సహాయం చేయాలన్నాడు. ‘ మాకు టిక్‌టాక్‌పై అవగాహన లేదు. దీనిపై సాయం చేయండి. నా ఐదేళ్ల కూతురి కోసం టిక్‌టాక్‌ వీడియో చేస్తున్నా. ఇందులో నాకు ఫాలోవర్స్‌ కూడా లేరు’ అని వార్నర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ఆ వీడియో పోస్ట్‌ చేశాడు. 

షీలా కి జవానీ అంటూ వార్నర్‌ ఇరగదీశాడు..

తాజాగా మరో టిక్‌టాక్‌ వీడియో చేశాడు. బాలీవుడ్‌ పాపులర్‌ సాంగ్‌, స్టార్‌ హీరోయిన్‌ నటించిన షీలా కి జవానీ పాటకి వార్నర్‌ స్టెప్పులు ఇరగదీశాడు. కూతురు ఇండీతో కలిసి డ్యాన్స్‌ ను అదరగొట్టేశాడు. దీన్ని కూడా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్‌ చేశాడు.  ‘ ఇండీ మీ కోసం ఇంకోసారి చేద్దామని అడిగింది’ అనే క్యాప్షన్‌ ఇచ్చాడు. ప్రస్తుతం వార్నర్‌  పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఇది గంటలోపే రెండు లక్షలకు పైగా వ్యూస్‌ను సాధించడం విశేషం. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌కు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు తిరిగి కెప్టెన్‌గా వార్నర్‌ ఎంపికయ్యాడు. గతంలో సన్‌రైజర్స్‌కు కెప్టెన్‌గా చేసిన వార్నర్‌..

ఆపై మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో ఏడాది కాలం క్రికెట్‌కు దూరమయ్యాడు.ఆ క్రమంలోనే ఐపీఎల్‌తో  సహా ఎన్నోఈవెంట్లను వార్నర్‌ మిస్సయ్యాడు. కాగా, మళ్లీ వార్నర్‌కు సన్‌రైజర్స్‌ పగ్గాలు అప్పచెప్పింది. అయితే కరోనా వైరస్‌ కారణంగా ఈ లీగ్‌ నిరవధిక వాయిదా పడింది. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం మార్చి 29వ తేదీన ఆరంభం కావాల్సిన ఐపీఎల్‌-13వ సీజన్‌ను తొలుత ఏప్రిల్‌ 15 వరకూ వాయిదా వేశారు. కరోనా వైరస్‌ ప్రభావం తగ్గకపోవడంతో ఐపీఎల్‌ను నిరవధిక వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.  ఈ తరుణంలో ఐపీఎల్‌ జరగడం అనుమానంగా మారింది. (నేనేమైనా పిచ్చోడిలా కనిపిస్తున్నానా..?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement