శ్రీలంకతో సిరీస్ కు కోహ్లీకి పగ్గాలు | virat kohli takes over as captain of srilanka series, mahendra singh dhoni rested | Sakshi
Sakshi News home page

శ్రీలంకతో సిరీస్ కు కోహ్లీకి పగ్గాలు

Oct 21 2014 2:12 PM | Updated on Sep 2 2017 3:13 PM

శ్రీలంకతో సిరీస్ కు కోహ్లీకి పగ్గాలు

శ్రీలంకతో సిరీస్ కు కోహ్లీకి పగ్గాలు

త్వరలో శ్రీలంకతో జరుగనున్న టీమిండియా సిరీస్ కు యువ ఆటగాడు విరాట్ కోహ్లీకి జట్టు పగ్గాలు అప్పజెప్పారు.

హైదరాబాద్: త్వరలో శ్రీలంకతో జరుగనున్న టీమిండియా సిరీస్ కు యువ ఆటగాడు విరాట్ కోహ్లీకి జట్టు పగ్గాలు అప్పజెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లో బీసీసీఐ ప్రెసిడెంట్‌ శివలాల్‌ యాదవ్‌ అధ్యక్షతన జరిగిన వర్కింగ్‌ కమిటీ అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ కు మహేంద్ర సింగ్ ధోనీకి విశ్రాంతి ఇచ్చిన బీసీసీఐ.. కోహ్లీని కెప్టెన్ గా నియమించింది. దీంతో పాటు వన్డేల వేదికలను కూడా ఖరారు చేసింది. కటక్, రాంచీ, హైదరాబాద్, కోల్ కతా, అహ్మదాబాద్ లలో వన్డేలు జరుగనున్నాయి.

 

దీంతో పాటుగా భారత్ సిరీస్ ను నాల్గో వన్డే అనంతరం అర్ధాంతరంగా ముగించిన వెస్టిండీస్ లీగల్ నోటీస్ పంపేందుకు బోర్డు సిద్ధమైంది. ఆ టూర్ కు సంబంధించి లైవ్ క్రికెట్ తో బీసీసీఐకి భారీ నష్టాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement