ఆ ఫుట్బాల్ ఆటగాడే స్ఫూర్తి:కోహ్లి | Virat Kohli Takes Inspiration From Cristiano Ronaldo | Sakshi
Sakshi News home page

ఆ ఫుట్బాల్ ఆటగాడే స్ఫూర్తి:కోహ్లి

Jan 2 2017 11:16 AM | Updated on Sep 5 2017 12:12 AM

ఆ ఫుట్బాల్ ఆటగాడే  స్ఫూర్తి:కోహ్లి

ఆ ఫుట్బాల్ ఆటగాడే స్ఫూర్తి:కోహ్లి

విరాట్ కోహ్లి.. భారత క్రికెట్ జట్టు సార్ట్ ఆటగాడు. ప్రపంచ క్రికెట్ పరుగుల మెషీన్గా పిలువబడుతున్న క్రికెటర్.

న్యూఢిల్లీ:విరాట్ కోహ్లి.. భారత క్రికెట్ జట్టు సార్ట్ ఆటగాడు. ప్రపంచ క్రికెట్ పరుగుల మెషీన్గా పిలువబడుతున్న క్రికెటర్. మన దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తరువాత దాదాపు అదే స్థాయి ఆటగాడు కోహ్లి. అయితే మన 'సూపర్ మ్యాన్' విరాట్ కోహ్లికి అత్యంత స్ఫూర్తిదాయకమైన ఆటగాడు ఒకడున్నాడంట.  అది కూడా ఫుట్ బాల్ ఆటగాడనే విషయం కోహ్లి తాజాగా వెల్లడించాడు.ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అంటే కోహ్లికి విపరీతమైన ఇష్లమట. పోర్చగల్ ఆటగాడైన రొనాల్డోను తాను ఎక్కువగా అనుకరించాలనుకుంటానని కోహ్లి తాజాగా పేర్కొన్నాడు.

'నాకు అత్యంత స్ఫూర్తిదాయమైన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది క్రిస్టియానో రొనాల్డోనే. అతను చాలా ఏళ్లుగా టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. కష్టించి కింది నుంచి పైకి వచ్చిన ఆటగాడు రొనాల్డో. ప్రపంచ ఫుట్బాల్లో ఎక్కువగా కష్టపడేది రొనాల్డో అనే మాటను నేను విన్నాను కూడా. అర్జెంటీనా స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సీ నైపుణ్యం కల్గిన ఆటగాడే కానీ కొద్దిపాటి అస్థిరత ఉంటుంది. రొనాల్డో అలాకాదు..నిరంతరం శ్రమిస్తూ అతన్ని ఎప్పటికప్పుడు తీర్చిదిద్దుకుంటూ ఉంటాడు. అదే అతన్ని స్టార్ ఫుట్బాల్ ఆటగాడిగా, ప్రపంచంలో ధనం ఎక్కువ సంపాదించే ఆటగాడి నిలబెట్టింది. రొనాల్డో ఎక్కువగా శ్రమించే ఆ స్థాయిని చేరుకున్నాడు. నాకు అతనే స్ఫూర్తి' అని కోహ్లి పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement