విరాట్‌ ఇంట విషాదం | Virat Kohli Mourned The Lifeless Of Their Pet Dog Bruno | Sakshi
Sakshi News home page

మిస్‌ యూ బ్రూనో..రిప్‌: కోహ్లి

May 6 2020 10:06 AM | Updated on May 6 2020 1:42 PM

Virat Kohli Mourned The Lifeless Of Their Pet Dog Bruno - Sakshi

హైదరాబాద్‌: టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి ఇంట విషాదం చోటు చేసుకుంది. వీరి ఇంటి పెంపుడు కుక్క బ్రునో బుధవారం ఉదయం మృతి చెందింది. ఈ విషయాన్ని కోహ్లి తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ‘11 ఏళ్ల మన ప్రయాణం జీవితాంతం ఓ తీపి​ గుర్తుగా మిగిలిపోతుంది. ఎప్పుడు నీ ప్రేమను మాపై కురిపించావు. ఈరోజు ఇక్కడి నుంచి వేరు చోటుకు వెళ్లావు. నీ ఆత్మకు శాంతి చేకూరేలాని దేవుడుని కోరుకుంటున్నా. రెస్ట్‌ ఇన్‌ పీస్‌ బ్రూనో’అంటూ కోహ్లి ఉద్వేగభరిత ట్వీట్‌ చేశాడు. కోహ్లి సతీమణి అనుష్క శర్మ కూడా ‘మిస్‌ యూ బ్రూనో.. రిప్‌’ అంటూ తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు.

ఇక విరాట్‌ కోహ్లికి బ్రూనో అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒత్తిడి తగ్గించుకోవడానికి బ్రునోతో ఆడుకునేవాడినని అతడు ఎన్నో సార్లు చెప్పాడు. అంతేకాకుండా కోహ్లి సోషల్‌ మీడియాలో బ్రూనోతో దిగిన ఫోటోలను షేర్‌ చేస్తుండేవాడు. ఇక అనుష్కకు కూడా బ్రూనోతో మంచి బాండింగే ఉంది. అమె కూడా బ్రూనోతో దిగిన ఫోటోలను తరుచు తన ఇన్‌స్టాలో షేర్‌ చేస్తుండేవారు. 

♥️ Bruno ♥️ RIP ♥️

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

చదవండి: 
‘ధోని, కోహ్లిలు వెన్నుపోటు పొడిచారు’
'అందుకే రైనాను పక్కన పెట్టాం'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement