మనోళ్లకు మూడు పతకాలు | Three medals for AP and TS | Sakshi
Sakshi News home page

మనోళ్లకు మూడు పతకాలు

Nov 30 2014 12:43 AM | Updated on Aug 28 2018 7:15 PM

జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నాలుగో రోజు శనివారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అథ్లెట్లకు కలిపి మూడు పతకాలు లభించాయి.

విజయవాడ స్పోర్ట్స్: జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నాలుగో రోజు శనివారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అథ్లెట్లకు కలిపి మూడు పతకాలు లభించాయి. అండర్-14 బాలుర హైజంప్‌లో ఎస్.రవీంద్ర రెడ్డి (ఆంధ్రప్రదేశ్) కాంస్యం సాధించాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వరుణ్ (1.86 మీటర్లు) జాతీయ రికార్డు నమోదు చేశాడు.

2011లో మహారాష్ట్రకు చెందిన అనిల్ (1.85 మీటర్లు) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. అనిల్ (హరియాణా-1.71 మీటర్లు)కు రజతం దక్కింది. అండర్-20 బాలికల 4ఁ100 మీటర్ల రిలేలో కేరళ జట్టు విజేతగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌కు కాంస్యం లభించింది. అండర్-16 బాలికల 1000 మీటర్ల స్ప్రింట్ మిడ్లే రిలేలో తెలంగాణ జట్టు కాంస్య పతకం నెగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement