మీరు ఎంజాయ్‌ చేయడానికి కాదు! | Sakshi
Sakshi News home page

డియర్‌ టీమిండియా.. ఎంజాయ్‌ చేయడానికి కాదు.. 

Published Sat, Jun 1 2019 8:57 AM

Team India Trolled For Fun Day Out In The Woods - Sakshi

లండన్‌ : ‘డియర్‌ టీమిండియా.. ఎంజాయ్‌ చేయడానికి కాదు ప్రపంచకప్‌ ఆడటానికి మిమ్మల్ని పంపించింది’ అంటూ కోహ్లిసేనపై భారత అభిమానులు మండిపడుతున్నారు. ప్రపంచకప్‌లో తమ తొలిపోరుకు ఇంకా సమయం ఉండటంతో తమకు లభించిన విశ్రాంతిని భారత క్రికెటర్లు సరదాగా గడుపుతున్నారు. గత మూడు రోజులుగా షాపింగ్‌లతో బిజిగా కనిపించిన టీమిండియా సభ్యులంతా శుక్రవారం అడవి బాట పట్టారు. పచ్చటి చెట్ల మధ్య పెయింట్‌బాల్‌ ఆడుతూ హుషారు ప్రదర్శించారు. ఈ పిక్‌నిక్‌కు సంబంధించిన ఫొటోలను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) తన అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేసింది. వాటికి క్యాప్షన్‌గా..‘   అడువుల్లో సరదాగా గడిపిన టీమిండియా చిత్రాలు.. మరిన్ని ఫొటోల కోసం చూస్తూనే ఉండండి’ అని పేర్కొంది.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : 
కోహ్లిసేనపై భారత అభిమానులు ఆగ్రహం

ఈ ట్వీట్‌ చూసిన అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. సోషల్‌ మీడియా వేదికగా టీమిండియా ఆటగాళ్లు, బీసీసీఐపై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. ప్రపంచకప్‌ లాంటి మెగా టోర్నీని టీమిండియా లైట్‌ తీసుకుంటుందని, ప్రాక్టీస్‌ సెషన్‌ లేకుండా పిక్‌నిక్‌లంటూ కాలం వృథా చేయడం ఏంటని మండిపడుతున్నారు. ‘మిమ్మల్ని పంపించింది క్రికెట్‌ ఆడటానికి.. పిక్‌నిక్‌లంటూ ఎంజాయ్‌ చేయడానికి కాదు’ అంటూ ఓనెటిజన్‌ కామెంట్‌ చేయగా.. ‘ఫన్‌ ఫన్‌ అంటే ప్రపంచకప్‌ చేజారిపోతుంది జాగ్రత్త’ అంటూ మరొకరు హెచ్చరించారు. ‘ముందు ప్రాక్టీస్‌ చేయండన్నా.. ఫన్‌ తర్వాత’ అంటూ ఇంకొకరు వేడుకున్నారు. ఇక భారత్‌ తన ప్రపంచకప్‌ తొలిపోరును ఈ నెల 5న సౌతాంప్టన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో ఆడనుంది.

Advertisement
Advertisement