పోరాడుతున్న శ్రీలంక | srilanka fight back in final test against england | Sakshi
Sakshi News home page

పోరాడుతున్న శ్రీలంక

Jun 11 2016 6:17 PM | Updated on Nov 9 2018 6:43 PM

మూడు టెస్టుల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్లో శ్రీలంక పోరాడుతోంది.

లండన్: మూడు టెస్టుల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్లో శ్రీలంక పోరాడుతోంది.  162/1  ఓవర్నైట్ స్కోరుతో శనివారం  మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన లంకేయులు వరుసగా కీలక వికెట్లు కోల్పోయారు. దీంతో శ్రీలంక లంచ్ సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది.

 

శ్రీలంక ఆటగాళ్లలో కౌశల్ సిల్వ(79), కరుణరత్నే(50)లు మాత్రమే రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఫిన్ మూడు వికెట్లు తీయగా, వోక్స్కు రెండు, స్టువర్ట్ బ్రాడ్కు ఒక వికెట్ దక్కింది. ప్రస్తుతం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ కంటే  శ్రీలంక 198 పరుగులు వెనుకబడింది. ఇంకా రెండు రోజులకు పైగా ఆట మిగిలి ఉండటంతో ఇంగ్లండ్ మరో విజయంపై కన్నేసింది. అంతకుముందు జరిగిన రెండు టెస్టుల్లో ఇంగ్లండ్ విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement