క్వార్టర్స్‌లో సాకేత్-భూపతి జంట | Somdev, Leander Paes, Mahesh Bhupathi Begin New Year at Home With Chennai Open | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సాకేత్-భూపతి జంట

Jan 8 2015 1:08 AM | Updated on Aug 20 2018 9:35 PM

క్వార్టర్స్‌లో సాకేత్-భూపతి జంట - Sakshi

క్వార్టర్స్‌లో సాకేత్-భూపతి జంట

చెన్నై ఓపెన్ ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలుగు తేజం సాకేత్ మైనేని తన భాగస్వామి మహేశ్ భూపతితో కలిసి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు.

చెన్నై: చెన్నై ఓపెన్ ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలుగు తేజం సాకేత్ మైనేని తన భాగస్వామి మహేశ్ భూపతితో కలిసి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సాకేత్-భూపతి ద్వయం 6-7 (4/7), 6-4, 10-6తో భారత్‌కే చెందిన ‘కవల సోదరులు’ చంద్రిల్ సూద్-లక్షిత్ సూద్ జంటపై చెమటోడ్చి గెలిచింది.

గంటా 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ జంట ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా శ్రమించింది. సాకేత్ మ్యాచ్ మొత్తం చురుకుగా కదలగా... 10 నెలల విరామం తర్వాత మళ్లీ బరిలోకి దిగిన భూపతి పలుమార్లు అనవసర తప్పిదాలు చేశాడు. గురువారం జరిగే క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ లియాండర్ పేస్ (భారత్)-క్లాసెన్ (దక్షిణాఫ్రికా)లతో సాకేత్-భూపతి తలపడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement