విమానంలో ఈత కొట్టిన భారత క్రికెటర్లు | Snorkelling in the flight with my mates twittes harbhajan | Sakshi
Sakshi News home page

విమానంలో ఈత కొట్టిన భారత క్రికెటర్లు

Mar 24 2016 7:52 PM | Updated on Sep 3 2017 8:29 PM

విమానంలో ఈత కొట్టిన భారత క్రికెటర్లు

విమానంలో ఈత కొట్టిన భారత క్రికెటర్లు

విమానంలో భారత క్రికెట్ ఆటగాళ్లు ఈత కొట్టారు. ఏంటి విమానంలో ఈత కొట్టడం ఏంటి..

విమానంలో భారత క్రికెట్ ఆటగాళ్లు ఈత కొట్టారు. విమానంలో ఈత కొట్టడం ఏంటి.. అది కూడా క్రికెటర్లు అంటున్నారు, అనుకుంటున్నారా ? నిజమేనండి.. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకు పోరాడి ఒక్క పరుగుతో విజయం సాధించిన భారత ఆటగాళ్లు ఫుల్ జోష్ మీద ఉన్నారు. బంగ్లాదేశ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో చివరి మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసి గట్టెక్కిన టీం ఇండియా ఆటగాళ్లు ఆ ఆనందాన్ని హోలీ రూపంలో జరుపుకొని..ఇప్పుడు విమానంలో కూడా ఈత కొట్టారు. అది కూడా నీటిలో ఆక్సిజన్ అందించే స్నోర్కెలింగ్ అనే పరికరాన్ని ధరించి.

హర్బజన్ సింగ్, రోహిత్ శర్మ, రహానేలు స్నోర్కెలింగ్ పరికరాన్ని ధరించి విమానంలో ఈత కొడతున్నట్టు ఉన్న వీడియోను హర్భజన్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. చాలా ఎంజాయి చేస్తున్నట్టు పేర్కొన్నాడు. అయితే యువరాజ్ సింగ్‌ మాత్రం తమతో జాయిన్ అవ్వడానికి సాహసించలేదంటూ హర్భజన్ ట్విట్  లో పేర్కొన్నాడు. ఓ లేటెస్ట్ యాప్ ను వాడి తాము విమానంలో ఈత కొడుతున్నట్లు కనిపించేలా బ్యాగ్రౌండ్ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. విశేషాలను ఓ వీడియో తీసి ఈ క్రికెటర్స్ బంగ్లాపై మ్యాచ్ విజయాన్ని ఆస్వాదించారు!
 

Advertisement
 
Advertisement
Advertisement