
సాధారణంగా చెవిలో అప్పుడు చీమలు, చిన్న చిన్న పురుగులు వెళ్లడం గురించి వింటుంటాం.. చెవిలో నీళ్లు పోసి లేదా ఏదైనా వస్తువుతో వాటిని బయటకు తీస్తాం. కానీ తాజాగా ఓ మహిళ చెవిలో ఏకంగా పీత ఇరుక్కుపోయింది. అంతేగాక దాన్ని తీసేందుకు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. మహిళ చెవిలో పీత ఇరుక్కుపోయిన వీడియోను ఓ టిక్‌టాక్ యూజర్ షేర్ చేశారు.
దీనిని బట్టి అట్లాంటిక్ తీరంలోని ప్యూయెర్టో రికోలో జరిగినట్టు తెలుస్తుంది. ఈ వీడియోలో మహిళ బీచ్‌లో ఉండగా ఆమె చెవిలోకి పీత వెళ్లిన్నట్లు గుర్తిస్తుంది. ఈ విషయాన్ని వెంటనే ఆమె పక్కన ఉన్న వ్యక్తి తెలియజేయగా.. అతను దానిని బయటకు తీయడానికి వ్యక్తి ఓ పరికరంతో ప్రయత్నిస్తుంటాడు. ఎంత ప్రయత్నించినా పీత బయటకు రాకపోగా మరింత లోపలికి వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
చివరికి అలాగే ప్రయత్నించగా చాలాసేపటకి పీత బయటకు వస్తుంది. అయితే మహిళ చెవిలోకి పీత ఎలా వెళ్లిందో తెలియదు గానీ ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. మహిళ పరిస్థితిని చూసి కాస్త భయందోళనకు గురయ్యారు. తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.
Huh??? pic.twitter.com/YeiMgYe4Q4
— Lady Sesshōmaru (@JasmineSW3) March 28, 2022
https://t.co/33N24UTpfp pic.twitter.com/X4btHoqlrG
— Name can't be blank (@brattypanda) March 28, 2022