సిక్కి రెడ్డి ‘డబుల్’ ధమాకా | sikhi reddy won two titles | Sakshi
Sakshi News home page

సిక్కి రెడ్డి ‘డబుల్’ ధమాకా

Feb 24 2015 12:34 AM | Updated on Sep 2 2017 9:47 PM

సిక్కి రెడ్డి ‘డబుల్’ ధమాకా

సిక్కి రెడ్డి ‘డబుల్’ ధమాకా

రాష్ట్రానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఎన్.సిక్కి రెడ్డి ఉగాండాలో జరిగిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ చాలెంజ్ టోర్నీలో డబుల్ ధమాకా సాధించింది.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఎన్.సిక్కి రెడ్డి ఉగాండాలో జరిగిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ చాలెంజ్ టోర్నీలో డబుల్ ధమాకా సాధించింది. పూర్వీషా రామ్ (బెంగళూరు)తో కలిసి మహిళల డబుల్స్ టైటిల్ గెలిచిన సిక్కి రెడ్డి... తరుణ్ కొనాతో మిక్స్‌డ్ డబుల్స్ ట్రోఫీ నెగ్గింది. మహిళల డబుల్స్ ఫైనల్లో సిక్కిరెడ్డి-పూర్వీష జంట 11-7, 6-11, 8-11, 11-7, 11-3తో నెగిన్- సొరయ హజియాగ (ఇరాన్) జోడిపై గెలిచింది. కొత్త పాయింట్ల పద్ధతి ప్రకారం పోటీలు జరిగాయి.

మిక్స్‌డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి-తరుణ్ ద్వయం 11-8, 11-10, 11-6తో మహ్మద్ అలీ కుర్త్-ఇనాల్ కదేర్ (టర్కీ) జంటపై గెలిచింది. ఇటీవల చక్కని ప్రదర్శనతో పతకాలు సాధిస్తున్న తెలంగాణ అమ్మాయిని రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు, మంత్రి కె.రామారావు, కోచ్ గోపీచంద్ అభినందించారు. జాతీయ క్రీడలకు ముందు విజయవాడలో సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మహిళల డబుల్స్ టైటిల్ గెలిచిన సిక్కిరెడ్డి, కేరళ ఆతిథ్యమిచ్చిన జాతీయ క్రీడల్లో 2 స్వర్ణాలు, ఒక రజతం గెలుచుకుంది.

Advertisement
Advertisement