'బ్రెట్ ‌లీ బ్యాటింగ్ అంటే భ‌య‌ప‌డేవాడు'

Shoaib Akhtar Comments On Brett Lee About Fear As Batsman - Sakshi

బ్రెట్ లీ, షోయ‌బ్ అక్త‌ర్.. ఈ ఇద్ద‌రు బౌల‌ర్లు వారి జ‌న‌రేష‌న్‌లో ఎవ‌రికి వారే సాటి.  గంట‌కు 160 కిలోమీట‌ర్ల వేగంతో బంతులు విసిరే ప్ర‌త్యేక‌త వీరికి మాత్ర‌మే ఉండేది.   అయితే ఒక బ్యాటింగ్ చేసేట‌ప్పుడు మాత్రం బ్రెట్‌లీ ప్ర‌తీ బౌల‌ర్‌కు భ‌య‌ప‌డేవాడ‌ని అక్తర్ పేర్కొన్నాడు. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా.. బ్రెట్‌లీ పాల్గొన్న ఇండియ‌న్ టెలివిజ‌న్ షో వీడియో ఒక‌టి త‌న ట్విట‌ర్‌లో షేర్ చేశాడు. బ్రెట్‌ లీ ఆ షోలో త‌న అనుభ‌వాల‌ను మొత్తం వివ‌రించాడు. అందులోనూ షోయ‌బ్ అక్త‌ర్‌ బౌలింగ్‌ను ఏ విధంగా ఎదుర్కొన్నాడ‌నేది చెప్పుకొచ్చాడు. ('నాపై ఒత్తిడి తెచ్చుంటే అక్రమ్‌ను చంపేవాడిని')

'నేను బ్యాటింగ్‌కు వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌తీ ఒక్క బౌల‌ర్‌కు భ‌య‌ప‌డేవాడిని.. ముఖ్యంగా స్పిన్న‌ర్ల‌కు కూడా. ఇక షోయ‌బ్ అక్త‌ర్ బౌలింగ్‌కు కూడా భ‌య‌ప‌డేవాడిని. అత‌డు బౌలింగ్ చేస్తుంటే న‌న్ను చంప‌డానికే బౌలింగ్ వేస్తున్నాడేమోన‌ని అనిపించేది.  నా ముద్దు పేరు బింగా.. ఒక‌సారి నేను బ్యాటింగ్ చేస్తుంటే బింగా.. బింగా.. అంటూ అరుస్తున్న శ‌బ్ధం విన‌ప‌డింది. త‌ల ఎత్తి చూస్తే 75 మీటర‌ల్ దూరంలో అక్త‌ర్ ఉన్నాడు. అత‌ని తీరు చూస్తే ని‌న్ను చంప‌డానికి  సిద్ధంగా ఉన్నా అన్న‌ట్లుగా క‌నపడింది.‌ షోయ‌బ్ నా త‌ల‌ను టార్గెట్ చేసి బౌలింగ్ వేస్తాడేమో అనుకున్నా.. కానీ ఆ బాల్ నా టోస్‌ను తాక్కుంటూ వెళ్లింది. అంతే నేను అది ఔటేమోన‌ని భావించి అంపైర్ వైపు చూశా.. అది క‌చ్చితంగా ఔటేన‌ని.. కానీ మా ఆస్ట్రేలియ‌న్ అంపైర్ నాటౌట్‌గా ప్ర‌క‌టించాడని' బ్రెట్‌లీ చెప్పుకొచ్చాడు. 
('స్వీట్‌హార్ట్‌.. డిన్న‌ర్ ఎక్కడ  చేద్దాం')

ఈ ఒక్క వీడియో చాలు.. బ్రెట్‌ లీ త‌న మాట‌ల ప‌ట్ల ఎంత నిజాయితీగా ఉంటాడో చెప్ప‌డానికి.. 'మా జ‌న‌రేష‌న్‌లో బ్రెట్‌లీ ఒక‌ బ్యాట్స్‌మెన్‌గా ఎంత భ‌య‌పడ్డాడ‌‌నేది స్ప‌ష్టంగా క‌నిపిస్తుందంటూ ' అక్త‌ర్ పేర్కొన్నాడు. ఆసీస్ త‌ర‌పున 76 టెస్టుల్లో 310 వికెట్లు,  221 వ‌న్డేల్లో  380 వికెట్లు తీశాడు. ఇక షోయబ్‌ అక్తర్‌ పాక్‌ తరపున 46 టెస్టుల్లో 176 వికెట్లు, 163 వన్డేల్లో 247 వికెట్లు పడగొట్టాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top