రెండు సార్లు డకౌట్‌.. ఇది కాదా స్థిరత్వం!

Shikhar Dhawan gets trolled for sharing batting practice video after getting out on golden duck against Essex - Sakshi

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా ఎసెక్స్‌ జట్టుతో జరిగిన మూడు రోజుల సన్నాహక మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో డకౌట్‌గా నిష్క్రమించడంతో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సన్నాహక మ్యాచ్‌లోనే ఇలా ఆడితే ఇక అసలు టెస్టు సిరీస్‌లో ఎలా ఆడతాడో అనే సందేహాలు వెలిబుచ్చుతున్నారు.  అదే సమయంలో ఒక ప్రాక్టీస్‌ వీడియోను ధావన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం నెటిజన్లకు మరింత కోపాన్ని తెప్పించింది.

‘ధావన్‌ మరోసారి డకౌట్‌ అయ్యాడు.. ఇక రాహుల్‌, విజయ్‌ను టెస్టుల్లో ఆడించడమే ఉత్తమం’ అని ఒక అభిమాని ట్వీట్‌ చేయగా, ‘సున్నాను కనిపెట్టిన ఆర్యభట్ట అంటే ధావన్‌కు ఎంతో ఇష్టం అనుకుంట. అందుకే రెండు ఇన్నింగ్స్‌ల్లో సున్నా పరుగులకే ఔటయ్యాడు.  ‘ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఓపెనింగ్‌ సమస్యపై బెంగ తీరింది’ అని మరొక​ అభిమాని సెటైర్‌ వేయగా, ‘ తొలి ఇన్నింగ్స్‌-0(1), సెకండ్‌ ఇన్నింగ్స్‌-0(3)..  ఇది కాదా ధావన్‌ స్థిరమైన బ్యాటింగ్‌కు నిదర్శనం’ అని మరొకరు ట్వీట్‌ చేశారు. ‘ధావన్‌.. నువ్వు బంతిని నెట్స్‌లో మాత్రమే బాదగలవు’ అని ఒక అభిమాని చమత్కరించాడు. ఇలా ధావన్‌పై సోషల్‌ మీడియాలో మాటల దాడి కొనసాగుతోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top