శార్దూల్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌ | Shardul Thakur takes a briliant catch at boundary against Bangladesh Match | Sakshi
Sakshi News home page

శార్దూల్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌

Mar 18 2018 8:02 PM | Updated on Mar 18 2018 8:20 PM

Shardul Thakur takes a briliant catch at boundary against Bangladesh Match - Sakshi

కొలంబో: ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో తుది పోరులో భారత ఆటగాడు శార్దూల్‌ ఠాకూర్‌ కళ్లు చెదిరే క్యాచ్‌తో శభాష్‌ అనిపించాడు. బౌండరీ లైన్‌కు కొద్దిపాటి దూరంలో మెరుపు వేగంతో క్యాచ్‌ పట్టి అబ్బురపరిచాడు. బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ లో భాగంగా చాహల్‌ వేసిన ఐదో ఓవర్‌ రెండో బంతిని తమీమ్‌ భారీ షాట్‌ కొట్టాడు. అది కచ్చితంగా సిక్సర్‌ అవుతుందని సగటు క్రికెట్‌ అభిమాని భావించిన తరుణంలో బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న శార్దూల్‌ గాల్లో ఎగిరి బంతిని అందుకున్నాడు.

అదే సమయంలో బౌండరీ లైన్‌ను తాకకుండా నియంత్రించుకోవడం హైలెట్‌గా నిలిచింది. బౌండరీ లైన్‌కు అంగుళం దూరంలో క్యాచ్‌ను శార్దూల్‌ అందుకున్న తీరు అబ్బురపరిచింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ ముందుగా ఫీల్డింగ్‌ తీసుకుంది. దాంతో బ్యాటింగ్‌ చేపట్టిన బంగ్లాదేశ్‌ దూకుడుగా ఆడే ప్రయత్నంలో 27 పరుగుల వద్ద లిటాన్‌ దాస్‌ను తొలి వికెట్‌ రూపంలో కోల్పోయింది. ఆపై అదే స్కోరు వద్ద తమీమ్‌ కూడా వెనుదిరిగడంతో బంగ్లాదేశ​​ కష్టాల్లో పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement